Bhola Shankar.. బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలొచ్చాయ్.. అదీ ఏడాది తిరగకుండానే.!
2022 ఏప్రిల్‌లో ‘ఆచార్య’ సినిమా వస్తే, అదే ఏడాది అక్టోబర్‌లో ‘గాడ్ ఫాదర్’గా వచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మెగా స్టామినా నిరూపించిన మెగాస్టార్ చిరంజీవి, తాజాగా ‘భోళా శంకర్’ గెటప్‌లోకి మారిపోయారు.
‘వాల్తేరు వీరయ్య’ వేరే లెవల్.! అవును, పోటీగా ‘వీర సింహా రెడ్డి’ సినిమా వున్నా, సంక్రాంతి హీరోయిజం మాత్రం మెగాస్టార్ చిరంజీవిదే..
Mudra369
తమిళ సినిమా ‘వేదాళం’కి తెలుగు రీమేక్ ఈ ‘భోళా శంకర్’. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాగా, కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది.
లెక్కలు మారాయ్..
‘ఆచార్య’ సినిమా కారణంగా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కి మకిలి పట్టించేందుకు కొందరు ప్రయత్నించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

నిజానికి, ‘ఆచార్య’ సినిమా ఫలితం చిరంజీవినీ కొంత గందరగోళానికి గురిచేసింది. అయితేనేం, కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసిన చిరంజీవి, ‘గాడ్ ఫాదర్’తో బౌన్స్ బ్యాక్ అయ్యారు.
‘వాల్తేరు వీరయ్య’ వేరే లెవల్.! అవును, పోటీగా ‘వీర సింహా రెడ్డి’ సినిమా వున్నా, సంక్రాంతి హీరోయిజం మాత్రం మెగాస్టార్ చిరంజీవిదే.. అని ‘వాల్తేరు వీరయ్య’ ఫలితం నిరూపించింది.
Bhola Shankar.. నాలుగోదీ వస్తుందా.?
ఇక, ఇప్పుడు ‘భోళా శంకర్’ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన చిరంజీవి, దానికీ అవసరమైన మార్పులు చేర్పులు చేయించనున్నారు.
మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీలానే, మెహర్ రమేష్ కూడా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.!
Also Read: వాల్తేరు వీరయ్యా.! ట్రెండు మార్చేశావయ్యా.!
సో, మెగాస్టార్ చిరంజీవి నుంచి ‘వాల్తేరు వీరయ్య’కు మించిన సూపర్ హిట్ సినిమా ‘భోళా శంకర్’ రూపంలో రాబోతోందన్నమాట.
‘భోళా శంకర్’ని గనుక, ఏప్రిల్ నెలాఖరు లోపు తీసుకురాగలిగితే, ఏడాది వ్యవధిలో మొత్తం నాలుగు సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి, తనదైన జోరుని చూపించినట్లవుతుంది.