Megastar Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవిలో హాట్ అప్పీల్ కనిపించడమేంటి.? ఇది మరీ టూమచ్.! ఎవరు అలా అన్నది.? ఇంకెవరు యాంకర్ శ్రీముఖి.!
అన్నట్టు, చిరంజీవితో ఓ సినిమాలో శ్రీముఖి ఆడి పాడననున్న సంగతి తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే, ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది శ్రీముఖి.
ఇంటర్వ్యూ గాల్లో జరిగింది.! అదేనండీ, విమానంలో. ఛార్టర్డ్ విమానంలో, మెగాస్టార్ చిరంజీవిని శ్రీముఖి ఇంటర్వ్యూ చేయడం విశేషమే మరి.!
ఇంటర్వ్యూ సందర్భంగా చిరంజీవి తనలోని హ్యూమర్‌ని మేగ్జిమమ్ బయటపెట్టేసినట్లున్నారు.
Megastar Chiranjeevi మెగా లుక్.. సూపర్ హాట్.!
ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అని మెగాస్టార్ చిరంజీవి విషయంలో గతంలోనే ప్రూవ్ అయిపోయింది.
తెరపై చిరంజీవి గెటప్ గురించి కాదు, ఆ పాత్ర వ్యవహరించే తీరు.. అసలాయన వయసెంత.? అనే ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘ఆచార్య’ సినిమాలో ఆయన వేసిన డాన్సులు అలాంటివి.

ప్చ్.. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఆ అవకాశం లేదు. ఇందులో పాటలకు పెద్దగా స్కోప్ లేదు. తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ కూడా జస్ట్ ప్రమోషనల్ సాంగ్ అన్నట్టే వుంది.
కానీ, నిశ్శబ్ద విప్లవం.. అంటూ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి చెబుతూ, సంగీత దర్శకుడు తమన్‌ని పొగిడేశారు చిరంజీవి.
ఇక, చిరంజీవి లుక్ సూపర్ హాట్.. అంటూ శ్రీముఖి మెలికలు తిరుగుతోంటే, చిరంజీవి ఇచ్చిన రియాక్షన్.. మాటల్లో వర్ణించలేం. ఆ విరుపులు చిరంజీవికి మాత్రమే సాధ్యం.!
మలయాళ ‘లూసిఫర్’.. తెలుగులో ‘గాడ్ ఫాదర్’
మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కి తెలుగు రీమేక్ ఈ ‘గాడ్ ఫాదర్’. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలి సారిగా తెలుగులో చేస్తోన్న సినిమా ఇది.
Also Read: జస్ట్ ఆస్కింగ్.! ఆ అవార్డుకి పూజా హెగ్దే అర్హురాలేనా.?
‘సైరా’ తర్వాత చిరంజీవితో కలిసి నటిస్తోంది నయనతార ఈ సినిమా కోసం. అయితే, ఈ సినిమాలో ఆమెది హీరోయిన్ రోల్ కాదు. చాలా చాలా స్పెషల్ రోల్.
రాజకీయ నేపథ్యంలో సాగే ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించారు.
తెలుగు ‘గాడ్ ఫాదర్’కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.