Megastar Chiranjeevi ఛీ.. ఛీ.. ఇలాంటోళ్ళు కూడా వుంటారా.? నిన్న పొగుడుతారు.. నేడు తిడతారు.! తిన్న ఇంటి వాసాలు లెక్కెడతారు.. ఇదీ మెగాస్టార్ చిరంజీవి మనసులోని ఆవేదన.
తన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరది.! ఆయన ఓ శిఖరం.! సినీ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని అత్యున్నత శిఖరాల్ని ఆయన అధిరోహించారు.
Megastar Chiranjeevi పొగడ్తలు.. తెగడ్తలు..
కానీ, రాజకీయాల్లో.? చిరంజీవిని ‘రక్తాన్ని దొంగిలిస్తాడు’ అనే ముద్ర వేశారు. అప్పటిదాకా చిరంజీవిని పొగిడినోళ్ళే ఆ విమర్శలు చేసింది.
రాజకీయాల్లోంచి చిరంజీవి తప్పుకోగానీ, మళ్ళీ చిరంజీవి మంచోడైపోయాడు. ఏమో, మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడేమోనన్న భయంతో, ‘చిరంజీవి ఏం చేశాడు ప్రజలకి.?’ అంటూ ప్రశ్నించేస్తున్నారు.
నటుడిగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవికి, ఇలా తన చుట్టూ వున్నవారే, తనను ఒక్కోసారి ఒక్కోలా చూస్తోంటే, అసహ్యం వెయ్యకుండా వుంటుందా.?
నెగ్గాలి.. తగ్గాలి.. రెండూ తెలియాలి.!
‘పోన్లే, ఎవరి పాపాన వాళ్ళే పోతారు..’ అని చిరంజీవి మాత్రం ఎన్నిసార్లు లైట్ తీసుకుంటారు.? ఆయనా ఉప్పూ కారం తింటున్నారు కదా.!
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
అవతలి వ్యక్తులది ఎంత నీఛమైన మనస్తత్వం అయినా, ఆ సంగతి తెలిసీ.. హుందాతనంతో వ్యవహరిస్తారు. ఆ వ్యక్తి స్థాయి పాతాళంలో వుందని తెలిసినా, సందర్భమొస్తే చేతులెత్తి నమస్కరించడం చిరంజీవి సంస్కారం.!
ఇవే, చిరంజీవి అభిమానులకీ ఆయన మీద ఒక్కోసారి ‘చిరు’ కోపం తెప్పిస్తాయి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు చిరంజీవికి.
కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన వెనకటి గుణమేల మాను.. అంటూ పెద్దలు ఎప్పుడో చెప్పారు.
పెద్ద మనసుతో ఇంట్లోకి ఆహ్వానిస్తే, తిని బలిసి.. తిరిగి పెంట పెంట చేసేవాళ్ళ విషయంలో చిరంజీవి అప్రమత్తంగా వుండాల్సిందే. ఇది కూడా చిరంజీవికి తెలియాలి.!
తెలుసుకుంటారా మరి.?