లక్ష్మీ భూపాల అనే ఓ రచయిత ‘రంగమార్తాండ’ సినిమా కోసం ఓ షాయరీ రాశారు. దాన్ని చిరంజీవి (Megastar Chiranjeevi) తనదైన స్టయిల్లో చెప్పారు.!
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తాండ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనసూయ భరద్వాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.!
Megastar Chiranjeevi కోసమేనా.?
‘రంగమార్తాండ’ సినిమాలో ఏముంటుంది.? అన్నది వేరే చర్చ. ‘నేనొక నటుడ్ని’ అంటూ చిరంజీవి చెప్పిన షాయరీ.. ఆయన జీవితాన్ని ఆవిష్కరించింది.
ఓ నటుడు తన గురించి తాను ఆవిష్కరించుకోవడమే ఈ షాయరీ ఉద్దేశ్యం. కానీ, చిరంజీవితాన్ని పూర్తిగా దీంట్లో ఆవిష్కరించారు రచయిత లక్ష్మీ భూపాల అనే విషయం సుస్పష్టం.
Also Read: Mega Star Chiranjeevi ‘పబ్లిసిటీ రైలు’.! బుర్ర చెడిందేమో.!
చిరంజీవి మాట్లాడుతున్నట్లు లేదు.. తన జీవిత కథలో తాను లీనమైపోతున్నట్లుగా అనిపించింది. దటీజ్ చిరంజీవి.!
ఇదంతా చెబుతున్నప్పుడు చిరంజీవి ఎలా ఫీల్ అయ్యారోగానీ, చిరంజీవి మాత్రం తన అభిమానులందర్నీ దీంతో కంటతడి పెట్టించేశారని నిస్సందేహంగా చెప్పొచ్చు.