Table of Contents
గోడ మీద పోస్టర్లపై పేడ కొట్టుకునేటోడికీ.. ఆ పోస్టర్లలోని కథానాయకుడికీ (Megastar Chiranjeevi) ఎంత తేడా వుంటుంది.?
ఒక వ్యక్తి స్థాయి ఏదో ఒక కారణంతో అనూహ్యంగా పెరిగినా, ఆయన పాత వ్యక్తిత్వం మాత్రం అలాగే ఏడుస్తుంది.
పూర్వాశ్రమంలో ఆయన ఓ పెద్ద హీరో అభిమాని అట. ఇతర హీరోల పోస్టర్లపై పేడ కొట్టే స్థాయి తనదని గతంలో చెప్పుకున్నాడాయన.
అలాంటోడి నుంచి సంస్కారాన్ని ఎలా ఆశించగలం. ఇప్పుడేదో ప్రవచనాలు చెప్పి గొప్ప ప్రవచనకారుడినని అహంకారం ప్రదర్శిస్తే, అంతకన్నా అజ్ఞానం ఇంకోటుండదు.
కనకపు సింహాసనమున ఓ శునకం..
కనకపు సింహాసమున శునకమును కూర్చుండబెట్టిన.. అని ఊరకే అన్లేదు కదా.! చిరంజీవి చుట్టూ పది మంది చేరి ఆయనతో ఫొటోల కోసం ఎగబడితే, చూసి ఓర్వలేనోడు ప్రవచనకారుడెలా అవుతాడు.?

ప్రవచనకారుడు కాదు, సంస్కార హీనుడతడు. అప్పుడెప్పుడో పోస్టర్ల మీద పేడ కొట్టినట్లే, సభా మర్యాదను తుంగలో తొక్కి చిరంజీవి అనే మహా శిఖరంపై పేడ కొట్టేందుకు ప్రయత్నించాడు.
ఏపాటిగాడతడు.? అని సదరు ప్రవచనకారుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంతే మరి, స్థాయిని దిగజార్చుకుంటే ఇలాగే వుంటుంది. పేరు ప్రస్తావించడానికి కూడా అసహ్యమేస్తుంది.
Megastar Chiranjeevi మెగా సంస్కారం..
చిరంజీవి సౌమ్యుడు. ఎవరి మీదా మాట తూలడానికి ఇష్టపడరు. తనను ఎవరైనా అవమానించినాసరే, హుందగా వ్యవహరిస్తారు. తన స్థాయికి తగనినివారిని కూడా గౌరవిస్తుంటారు. గొప్పవారి లక్షణమది.
దీన్ని చేతకానితనంగా కొందరు భావిస్తుంటారు. అదే అసలు సమస్య. వంగి వంగి దండాలెడుతున్నాడు చిరంజీవి.. కాబట్టి, మేం అన్నిటికీ అతీతులం, చిరంజీవి కంటే గొప్పోళ్ళమనే స్థాయికి అహంకారం వారిలో పెరిగిపోతుంది.
చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే ఆయనగారు వెళ్ళిపోతాడట. చికాకు పుట్టి, వెళ్ళిపోవాలనుకున్నోడెవడూ చెప్పి వెళ్ళడు.. ఛండాలం చేయాలనుకున్నోడే వెకిలితనం ప్రదర్శిస్తాడు. అహంకారాన్ని చూపిస్తాడు.
ప్రవచన పైత్యం.!
‘అలయ్ బలయ్’ అంటే, ఆత్మీయ ఆలింగనమని. భిన్న రంగాలకు చెందిన, భిన్న పార్టీలకు చెందిన, భిన్నమైన ఆలోచనలు కలిగినవారందరూ ఒక్క వేదికపై హుందాగా ప్రవర్తించాల్సి వుంటుంది.. అదే అలయ్ బలయ్ అర్థం.
Also Read: కోట్లు సంపాదించే పవన్ కళ్యాణ్.. కార్లు కొనుక్కోలేరా.?
అది కూడా తెలియనోడ్ని అసలు అక్కడికి ఎలా ఆహ్వానించారన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. వచ్చాడు సరే, మంచి మాటలో చెడ్డ మాటలో చెప్పి వెళ్ళక, సంస్కార హీనత్వాన్ని ప్రదర్శిస్తే ఎలా.?
పదుల సంఖ్యలో ప్రముఖులు హాజరైన కార్యక్రమాన్ని ఛండాలం చేయాలనుకునేవాడు ప్రవచన కర్త ఎలా అవుతాడు.?