Table of Contents
చెప్పానా.. నేను చెప్పానా.. అంటూ క్యూట్ క్యూటుగా తొలి తెలుగు సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ (Krishna Gadi Veera Prema Gaadha)తో తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసిన మెహ్రీన్ కౌర్ (Mehreen Kaur Pirzada), పలు తమిళ సినిమాలూ అలాగే కొన్ని హిందీ సినిమాలూ చేసింది. స్టార్ హీరోయిన్ అవదగ్గ అన్ని అర్హతలూ వున్నా, ఎక్కడో లక్కు కాస్త చిన్న చూపు (Mehreen Kaur Pirzada Honey Is The Best) చూసిందేమో ఈ బ్యూటీకి.
అయితేనేం, మెహ్రీన్ కౌర్ పిర్జాదా తెలుగులో చెప్పుకోదగ్గ విజయాల్నే అందుకుంది. వాటిల్లో బిగ్గెస్ట్ హిట్ అటే, ‘ఎఫ్2‘ సినిమానే. ఈ సినిమాలో హనీ ఈజ్ ది బెస్ట్.. అంటూ మెహ్రీన్ పలికే పలుకులు ఇప్పటికీ కుర్రకారు గుండెల్లో కితకితలు రేపుతుంటాయి.
కాజల్ బాటలోనే మెహ్రీన్.. కానీ..
కరోనా పాండమిక్ సమయంలో కాజల్ అగర్వాల్ పెళ్ళయిపోయింది.. అంతలోనే మెహ్రీన్ కౌర్ పిర్జాదా నుంచి కూడా పెళ్ళి ప్రకటన వచ్చింది. భవ్య బిష్ణోయ్.. అనే కుర్రాడితో ప్రేమలో పడింది మెహ్రీన్. వీళ్ళ పెళ్ళికి పెద్దలూ అంగీకరించారు. భవ్య బిష్ణోయ్.. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. త్వరలో పెళ్ళి.. అనుకుంటుండగా, అనూహ్యంగా ‘బ్రేక్ ఆఫ్’ ప్రకటన చేసింది మెహ్రీన్.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
అసలేమయ్యింది.? అంటూ అంతా ఆశ్చర్యపోయేలోపు చాలా ఊహాగానాలొచ్చాయి. మెహ్రీన్ కెరీర్ బాగుండాలని శుభాకాంక్షలు చెబుతూ బ్రేక్ ఆఫ్ వార్తల్ని కన్ఫామ్ చేశాడు భవ్య బిష్ణోయ్. తాము విడిపోవడం గురించి ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించాడు.
ప్రమాదకరమైన మహిళ ఎవరు.?
ఇదిలా వుంటే, మెహ్రీన్.. గత కొద్ది రోజులుగా ఆసక్తిగొలిపే కామెంట్లు పెడుతోంది సోషల్ మీడియా వేదికగా. అందులో ‘అత్యంత ప్రమాదకరమైన మహిళ, తనను తాను రక్షించుకోవడానికి.. తన చేతిలో ఇంకొకరి కత్తి వుండాల్సిన అవసరం గురించి ఆలోచించదు. ఎందుకంటే, తనంతట తనుగా ఓ కత్తిని కలిగి వుంటుంది..’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేసింది ఓ ఫొటోతోపాటుగా.
Also Read: ఛీ పాడు.. ‘అలా’ నన్ను చూడొద్దు.!
“The most dangerous woman of all is the one who refuses to rely on your sword to save her because she carries her own” అంటూ ట్వీటేసింది మెహ్రీన్.
అంతే, అంతా అవాక్కయ్యారు. ఇదేదో జనరల్ పోస్ట్ అనుకునేరు. మెహ్రీన్ అంతరంగమే ఇది.. అంటూ జనం చర్చించుకుంటున్నారు. ఇంతకీ, మెహ్రీన్ ఇలా భయపెట్టే పోస్ట్ పెట్టింది ఎవరి కోసం.? ఏమోగానీ, ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ (Mehreen Kaur Pirzada Honey Is The Best) అవుతోంది.