Mehreen Slams Marriage Rumors.. సినీ నటి మెహ్రీన్, ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. గతంలో ఓ పొలిటీషియన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగినా, అది రద్దయ్యింది.
కానీ, మెహ్రీన్‌కి పెళ్ళయిపోయిందంటూ గత కొన్నాళ్ళుగా గాసిప్స్ చూస్తూ వస్తున్నాం. ఈ గాసిప్స్‌పై ఎట్టకేలకు స్పందించింది మెహ్రీన్.
తనకు పెళ్ళి జరగలేదనీ, తానింకా సింగిల్‌గానే వున్నాననీ మెహ్రీన్ చెప్పుకొచ్చింది. పదే పదే తన వ్యక్తిగత జీవితంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది మెహ్రీన్.
ఇదేం జర్నలిజం.?
సోషల్ మీడియా వేదికగా మెహ్రీన్, తన పెళ్ళి పుకార్లపై స్పందించింది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలపై గుస్సా అయ్యింది మెహ్రీన్.
ఓ జర్నలిస్టు పేరు ప్రస్తావిస్తూ మెహ్రీన్ కడిగి పారేసింది. ఇదేం పద్ధతి.? అంటూ మండిపడింది. పనిగట్టుకుని తనను గాసిప్స్‌తో వేధిస్తున్నారని మెహ్రీన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిజానికి, ఈ తరహా గాసిప్స్ చాలామంది సినీ తారలపై నిత్యం వస్తూనే వుంటాయ్. కొందరు లైట్ తీసుకుంటారు, కొందరు సీరియస్ అవుతుంటారు.
తనపై వస్తున్న పుకార్ల విషయమై లీగల్ యాక్షన్ దిశగా మెహ్రీన్ అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది.
Mehreen Slams Marriage Rumors.. పెళ్ళి చేసుకుంటానుగానీ..
ఖచ్చితంగా భవిష్యత్తులో పెళ్ళి చేసుకుంటాను.. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే వున్నాను. పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు, అందరికీ చెప్పే చేసుకుంటా.. అని ట్విట్టర్ వేదికగా మెహ్రీన్ క్లారిటీ ఇచ్చేసింది.
సినిమాల్లేకపోయినా, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గానే వుంటోంది మెహ్రీన్.
నాని హీరోగా తెరకెక్కిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్, టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే.
ఓ వెబ్ సిరీస్‌లో కూడా మెహ్రీన్ సందడి చేసింది.
