Mining Don Gali Jailed.. వ్వవస్థల్ని రాజకీయ నాయకులు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు.? దేశ సంపదని ఎలా దోచుకుంటున్నారు.? ఇవన్నీ నిత్యం మనం మాట్లాడుకుంటున్నవే.
కర్నాటక మైనింగ్ దొంగ గాలి జనార్ధన్ రెడ్డికి న్యాయస్థానం ఏడేళ్ళ శిక్ష విధించింది. పదిహేనేళ్ళుగా నడుస్తున్న కేసు ఇది.! గాలి జనార్ధన్ రెడ్డి అంటే, కర్నాటక మాజీ మంత్రి.
వందల కోట్లు కాదు, వేల కోట్లు.. లక్షల కోట్ల ఆస్తులున్నాయ్ గాలి జనార్ధన్ రెడ్డికి. ఆ డబ్బుతో ఏకంగా జడ్జినే కొనేయాలని చూసిన ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి.
Mining Don Gali Jailed.. ఏడేళ్ళ జైలు శిక్ష..
అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధ్ రెడ్డికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు.
ఈ కేసులో మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి క్లీన్ చిట్ రావడం ఆశ్చర్యకరం. ఇదే కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్షికి కూడా క్లీన్ చిట్ రావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గాలి జనార్ధన్ రెడ్డి ‘మైనింగ్’ పేరుతో అప్పనంగా కోట్లు కొల్లగొట్టాడనే ఆరోపణలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డి ‘దత్త పుత్రుడు’ అంటుంటారు.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ సంస్థకి.. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో అప్పనంగా భూముల్ని దోచి పెట్టిన సంగతీ విదితమే.
పదిహేనేళ్ళు ఎందుకు పట్టింది.?
ముందే చెప్పుకున్నాం కదా.. గాలి జనార్ధన్ రెడ్డి ఎంత పవర్ ఫుల్.. అనేది.! వ్యవస్థల్ని మేనేజ్ చేయగలడు.. రాజకీయంగా ఇట్నుంచి అటు, అట్నుంచి ఇటు దూకగల చాణక్యం వున్నోడు.
అందుకే, కేసు విచారణ జరిగి, నేరం నిరూపితమవడానికి ఇన్నేళ్ళు పట్టింది. సీబీఐ కోర్టు శిక్ష విధించింది సరే, హైకోర్టును గాలి జనార్ధన్ రెడ్డి ఆశ్రయిస్తే.?
హైకోర్టులోనూ అదే శిక్ష పడినా, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా గాలి జనార్ధన్ రెడ్డికి వుంటుంది కదా.?
ఈ తరహా కేసుల్లో, రాజకీయ నాయకులు కొల్లగొట్టిన ప్రజాధనం.. తిరిగి ప్రభుత్వ ఖజానాకి చేరడం అనేది ముఖ్యం. అది జరిగినప్పుడు మాత్రమే, న్యాయం గెలిచినట్లవుతుంది.
