Miss Shetty Mr Polishetty.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? ఔను, చాన్నాళ్ళ తర్వాత వెండితెరపై కనిపించబోతోంది స్వీటీ.. అదేనండీ అనుష్క శెట్టి.
‘జాతిరత్నాలు’ ఫేం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో అనుష్క కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
యంగ్ హీరోతో.. సీనియర్ హీరోయిన్ జత కడితే.. ఆ కిక్కే వేరప్పా.! ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నుంచి ఓ వీడియో సాంగ్‌ని చిత్ర నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్ విడుదల చేసింది.
Miss Shetty Mr Polishetty.. అనుష్క.. నాజూగ్గా.!
ఆ మధ్య అనుష్క బాగా బొద్దుగా తయారైంది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం చేసిన ప్రయత్నం, ఆమె ఆరోగ్యాన్నీ దెబ్బ తీసిందనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగిందనుకోండి.. అది వేరే సంగతి.
ఎలాగైతేనేం, అనుష్క (Anushka Shetty) మళ్ళీ నాజూగ్గా తయారైంది. ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అంటాం కదా.. అది అనుష్క విషయంలో ముమ్మాటికీ నిజం.
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ నుంచి విడుదలైన సాంగ్‌లో అనుష్క చాలా క్యూట్‌గా చాలా బబ్లీగా కనిపించింది.
అయితే, కొన్ని చోట్ల ఆమె ఫిజిక్‌లో తేడాలు కనిపించాయనుకోండి.. అది వేరే సంగతి.
పాట అదిరింది..
పాట అయితే ఇంట్రెస్టింగ్‌గా సాగింది. కూల్ అండ్ లవ్లీగా డిజైన్ చేశారు. హీరోయిన్‌ని ఉద్దేశించి హీరో పాడే పాట అది.
‘జాతిరత్నాలు’తో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయిన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరో అయినా, అనుష్క స్టార్‌డమ్‌ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇది అనుష్క సినిమానే అనాలేమో.!