Mohanbabu Chandrababu Friendhsip.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చశారు సినీ నటుడు, నిర్మాత ‘కలెక్షన్ కింగ్’ మోహన్‌బాబు. ఇది అందరికీ తెలిసిన విషయమే.
తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయి, గంటకు పైగా ‘కలెక్షన్ కింగ్’ మంతనాలు జరపడం సహజంగానే రాజకీయాల్లో చర్చనీయాంశమవుతుంది.
అబ్బే, రాజకీయ భేటీ కాదంటూ ఓ వైపు మంచు కాంపౌండ్ నుంచి వివరణ వస్తున్నా, చంద్రబాబుతో మోహన్‌బాబు భేటీ అంటే, ఆ మాత్రం ‘పొలిటికల్ స్టఫ్’ వుండకుండా వుంటుందా.?
Mohanbabu Chandrababu Friendhsip.. మీదీ మాదీ ఒకటే.!
పైగా, ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. అందునా, పాత మిత్రులు.. ప్రియమైన శతృవులు కూడా.!

హెరిటేజ్ సంస్థలో తనకూ వాటాలుండేవని చెబుతారాయన. చంద్రబాబు కుట్ర పూరితంగా తనను ఆ వ్యాపారం నుంచి తప్పించారని పలు సందర్భాల్లో మోహన్‌బాబు ఆరోపించారు.
అన్నగారి పార్టీ.. చంద్రబాబు లాక్కున్నారు.. వెన్నుపోటు.. అబ్బో, చెప్పుకుంటూ పోతే చాలానే వుంటాయ్.! ముక్కుసూటితనానికి కేరాఫ్ అడ్రస్ అయిన మోహన్బాబు, అవన్నీ ఎలా మర్చిపోయారబ్బా.?
అన్నీ మర్చిపోయినట్టేనా.?
అన్నీ మర్చిపోయి, చంద్రబాబుతో రాజకీయంగా మోహన్‌బాబు (Manchu Mohanbabu) భేటీ అయ్యారన్న ప్రచారంలో నిజమెంత.?
ఏమోగానీ, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి కోసం పనిచేసిన మోహన్‌బాబు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు కోసం ప్రచారం చేస్తే.. అది ఖచ్చితంగా పెను సంచలనమే అవుతుంది.
Also Read: టార్గెట్ నాగచైతన్య.! సమంత ‘ఆపరేషన్’ సక్సెస్.!
అయినా, ఇటీవలే ‘నేను బీజేపీ మనిషిని’ అని చెప్పుకున్న మోహన్‌బాబు, చంద్రబాబుతో ఎలా కలుస్తారట.? ఈ భేటీ వెనుక ‘మెగా వ్యూహం’ ఏమైనా వుందా.?
రాజకీయాలంటేనే కప్పల తక్కెడ.! ఓసారి అటు, ఇంకోసారి ఇటు, మరోసారి ఇంకో వైపు. సో, రాజకీయంగా అయితే మోహన్‌బాబుని ఈ చిత్ర విచిత్రమైన కలయికల విషయంలో విమర్శించలేం.
కానీ, ముక్కుసూటితనం, మాట మీద నిలబడ్తాను.. లాంటి మాటలే.. తేడా కొడుతుంటాయ్.