బిగ్‌హౌస్‌లో రొమాంటిక్ ఫీల్ (Monal Gajjar Abijeet Akhil Sarthak) కోసం.. ఏదేదో చేసేస్తున్నారు. గత సీజన్‌లో (బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్) రాహుల్ సిప్లిగంజ్ – పునర్నవి భూపాలం (Rahul Sipligunj – Punarnavi Bhupalam) మధ్య చాలా కెమిస్ట్రీ నడిపించారు. చివరకి అదంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. నిజానికి రాహుల్ – శ్రీముఖి మంచి స్నేహితులైతే, బిగ్‌బాస్‌లో సీన్ మొత్తం మారిపోయింది.
ఇక, ఇప్పుడు మోనాల్ గజ్జర్ (Monal Gajjar), అబిజీత్ (Abijeet), అఖిల్ సార్దక్ (Akhil Sarthak)ల మధ్య ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ నడుస్తోందంటూ బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) ప్రోమోలు వదులుతున్నారు. హౌస్‌లోనూ అందుకు తగ్గట్టే సన్నివేశాల్ని ‘డిజైన్ చేసి’ ప్రసారం చేస్తున్నారు. కానీ, అసలక్కడ ఏం జరుగుతోందో బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి అర్థం కావడంలేదు.
పైగా, ఆ కెమిస్ట్రీ అంతా డ్రమెటిక్‌గానే కనిపిస్తోంది. ‘నాకు నువ్వు స్నేహితుడివి.. అబి కూడా అంతే..’ అంటూ మోనాల్ తేల్చేసింది. మరోపక్క అబిజీత్ – అలేఖ్య మధ్య ఇంకో ట్రాక్ నడుస్తోంది. నిజానికి ఇవేవీ ‘లవ్ ట్రాక్‌లు’ కావు. సాధారణంగా వుండే స్నేహాలే. వాటిని ఇంకాస్త ఎక్కువ చేసి ప్రోమోలు వదులుతున్నారంతే.
గత సీజన్‌లో ఇలా ‘పులిహోర’ కలిపినా బాగానే వర్కవుట్ అయ్యింది రాహుల్ – పునర్నవి విషయంలో. కానీ, ఇప్పుడెందుకో ‘డ్రామా’ ఎక్కువైపోయినట్లు అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మోనాల్‌తో అటు అబి ట్రాక్, ఇటు అఖిల్ ట్రాక్.. రెండూ పేలవంగా తయారయ్యాయి.
కాస్తో కూస్తో మోనాల్ – అబిజీత్ (Monal Gajjar – Abijeet)మధ్యనే కొంత బెటర్ ట్రాక్ వుందని అనుకోవాలేమో. అఖిల్‌ని తీసుకెళ్ళి బలవంతంగా మోనాల్‌తో ఇరికించినట్లుంది. అబిజీత్ – మోనాల్ ట్రాక్‌ని అఖిల్ డిస్టర్బ్ చేస్తున్నాడా? అనేలా స్క్రీన్‌ప్లే నడుస్తోంది. అలా అఖిల్ మీద నెగెటివిటీ పెరుగుతోందన్నమాట.
‘మోనాల్‌ని పెళ్ళి చేసుకుంటానని లోపలికి వెళ్ళావ్ కదా..’ అని బిగ్ హోస్ట్ నాగ్, వీకెండ్ ఎపిసోడ్‌లో ఓపెన్ అయిపోయాక.. మోనాల్ – అబి ట్రాక్ చెడిపోవడం గమనార్హమిక్కడ. ఆ ట్రాక్‌లోకి అఖిల్‌ని తీసుకొచ్చి, దీన్నొక ట్రయాంగిల్ లవ్ స్టోరీలా మార్చే ప్రయత్నం ప్రోమోలతో చేయడం కంటే, మిగతా కంటెస్టెంట్స్ మీద కూడా ఫోకస్ పెడితే మంచిదేమో.
హౌస్‌లో (Bigg Boss 4 Telugu) బోల్డంత ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఆస్కారముంది. అది మానేసి.. చప్పగా సాగుతున్న లవ్ ట్రాక్‌ని హైలైట్ చేయడమేంటో!