గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ (Monal Gajjar Item Song In Sarkaru Vaari Paata) తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. అయితే, ఆ సినిమాలేవీ ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టలేదు. అయితే, అనూహ్యంగా ఆమె బిగ్ బాస్ రియాల్టీ షోలో సీజన్ 4 ద్వారా తెలుగువారందరికీ మరింతగా సుపరిచితురాలైంది.
టైటిల్ కొట్టలేకపోయినాగానీ, నాలుగో సీజన్‌లో బిగ్గెస్ట్ విక్టరీ మోనాల్ గజ్జర్ సొంతమయ్యింది. బిగ్ బాస్ సీజన్ 4లో ఆమె అత్యధిక పారితోషికం దక్కించుకున్నట్లుగా వార్తలొచ్చాయి. ఇక, ఆ తర్వాత ఆమె ఓ స్పెషల్ సాంగ్‌లో కన్పించింది. అదే ‘అల్లుడు అదుర్స్’ సినిమా కోసం చేసిన ఐటమ్ నెంబర్.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ హాట్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. ఆ గాసిప్ ప్రకారం చూస్తే, అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సూపర్బ్ ఐటమ్ నెంబర్‌లో స్టెప్పులేయనుందట మోనాల్ గజ్జర్ (Monal Gajjar Item Song In Sarkaru Vaari Paata). అదే నిజమైతే, మోనాల్ గజ్జర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్‌గా చెప్పుకోవచ్చేమో.
ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. ‘గీత గోవిందం’ ఫేం పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించబోతోంది. ఇదిలా వుంటే, మోనాల్ గజ్జర్ ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఓ డాన్స్ షో జడ్జిగా వ్యవహరిస్తోంది.
బిగ్ బాస్ ముగిశాక, ఆ సీజన్ కంటెస్టెంట్స్‌లో ఎక్కువ ఫాలోయింగ్ కొనసాగిస్తున్నది మోనాల్ గజ్జర్ మాత్రమేనన్నది నిర్వవాదాంశం. ఇక, ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్న మోనాల్, ‘సర్కారు వారి పాట’ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం కూడా రికార్డు స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటోందని సమాచారమ్.
అయితే, ఇంతవరకు ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) టీమ్ ఈ గాసిప్‌పై స్పందించలేదు.