Mrunal Thakur Age.. మీకు తెలుసా.? ‘సీతారామం’ బ్యూటీ వయసు జస్ట్ పదహారేళ్ళే.! ఛ.. ఊర్కోండి.! తక్కువలో తక్కువ ముప్ఫయ్ ఏళ్ళయినా వుంటాయ్ కదా.!
నిజానికి, తనకు పదహారేళ్ళేనని చెప్పింది స్వయానా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కావడం గమనార్హం.! ఎందుకిలా.?
అసలు విషయం వేరే వుంది. గ్లామర్ ప్రపంచాన్ని కెరీర్‌గా ఎంచుకున్నప్పటికి ఆమెకు జస్ట్ పదహారేళ్ళేనట. అదీ అసలు సంగతి.
డాక్టర్ అవుదామనుకుని..
చాలామంది ‘నేను డాక్టర్ అవుదామనుకున్నానుగానీ, యాక్టర్ అయ్యాను..’ అని చెబుతుంటారు. మృణాల్ ఠాకూర్ కథ కూడా దాదాపు అలాంటిదే.
డెంటిస్ట్ అవుదామనుకుని, అనుకోకుండా మోడలింగ్ రంగంలోకి వచ్చి, నటనను కెరీర్‌గా ఎంచుకుంది.

తెలుగు తెరపైకి కాస్త లేటుగా వచ్చినా, నటనా రంగంలోకి ఆమె ఏనాడో వచ్చేసింది. పలు కమర్షియల్ యాడ్స్ చేసింది, సీరియళ్ళలోనూ నటించింది, సినిమాల్లోనూ నటించింది.
Mrunal Thakur Age.. మార్మోగిపోతోందంతే..
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మృణాల్ ఠాకూర్ పేరు మార్మోగిపోతోంది. ఇప్పటిదాకా ఆమె నుంచి వచ్చింది ఒకే ఒక్క సినిమా.. అదే ‘సీతారామం’.
కానీ, ‘హాయ్ నాన్న’ సహా పలు సినిమాల్లో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. స్టార్ హీరోల సినిమా ఏదన్నా సెట్స్ మీదకు వెళుతోందంటే, ముందుగా మృణాల్ ఠాకూర్ పేరే గాసిప్పుల్లోకి ఎక్కుతోంది.
Also Read: రష్మిక మండన్న ఎవరికి ‘గర్ల్ ఫ్రెండ్’.?
అదీ అసలు సంగతి. ఇంతకీ, మృణాల్ ఠాకూర్ ప్రస్తుత వయసెంత.! ఈరోజుల్లో వయసుని దాచడం సాధ్యమయ్యే పని కాదు.
అందుకే, తన వయసు 31 ఏళ్ళు అని మృణాల్ ఠాకూర్ చెప్పేసింది. అదండీ అసలు సంగతి.!