Home » ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఎమర్జెన్సీ మీద మోజెక్కువైంది.!

ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఎమర్జెన్సీ మీద మోజెక్కువైంది.!

by hellomudra
0 comments
Mudragada Padmanabha Reddy

Mudragada Padmanabha Reddy Emergency.. ‘ప్రధాన మంత్రి గారిని కోరి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఎమర్జెన్సీ పెట్టమని అడగండి’ అంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఉచిత సలహా ఇచ్చారు ముద్రగడ పద్మనాభ రెడ్డి.

ఒకప్పుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంటే, ఓ బ్రాండ్.! కాపు సామాజిక వర్గంలో ఆయనకు ప్రత్యేకమైన గౌరవం వుండేది.

కానీ, వైసీపీ మీద ప్రేమతో.. అలానే, ‘రెడ్డి’ సామాజిక వర్గం మీద విపరీతమైన ప్రేమతో.. తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారాయన.

2024 ఎన్నికల సమయంలో, పవన్ కళ్యాణ్ మీద నానా రకాల రాజకీయ విమర్శలూ చేసిన ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ గెలిస్తే, తన పేరుని ‘రెడ్డి’గా మార్చుకుంటానని ప్రకటించారు.

మాటకు కట్టుబడి ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయారు.! పవన్ కళ్యాణ్ మీద విసిరిన సవాల్ అనేది ఓ వంక మాత్రమే.

ఆలోచనలన్నీ ‘రెడ్డి’ అనే గుర్తింపు చుట్టూ సంచరించడంతో, జన్మనిచ్చిన కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేస్తూ ‘రెడ్డి’ అయిపోయారాయన.

సరే, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోగలరుగానీ, కులాన్ని మార్చుకోగలరా.? అది సాధ్యం కాదనుకోండి.. అది వేరే చర్చ.!

అయినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరతారు.?

మాజీ మంత్రి కదా.? ముద్రగడ పద్మనాభ రెడ్డికి ఆ మాత్రం ఇంగితం లేకపోతే ఎలా.? వైసీపీ నాయకులు, అత్యంత అసభ్యకరమైన రీతిలో చంద్రబాబు మీద దూషణలకు దిగుతున్నారు.

ఆ దూషణల్ని ముద్రగడ పద్మనాభ రెడ్డి సమర్థిస్తున్నారా.? సమర్థిస్తే, అంతకన్నా హేయం ఇంకోటి వుండదు. పైగా, ‘రెడ్డి’ అని పేరు మార్చుకున్న ముద్రగడ, కాపు కులం గురించి ఎలా వకాల్తా పుచ్చుకుంటారు.? ఆయనకి ఆ నైతిక హక్కు లేదు.

ఏతావాతా చెప్పేదేంటంటే.. ఇది కులాల పంచాయితీ కాదు. రెండు రాజకీయ పార్టీల మధ్య రాజకీయ పోరు, పైగా ఆధిపత్య పోరు.

నేరానికి కులం వుండదు.! కులాన్ని ఆపాదిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. వైసీపీ హయాంలో, టీడీపీ కార్యాలయంపై దాడికి వెళ్ళారు వైసీపీ కార్యకర్తలు.

జగన్ మీద దూషణల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు బీపీలు తెచ్చుకున్నట్లే (ఇది జగన్ చెప్పిన మాటే), ఇప్పుడు చంద్రబాబు మీద దూషణల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు బీపీలు తెచ్చుకుంటున్నారంతే.. అనుకోవాలేమో.

అయినాసరే, భౌతిక దాడులు సమర్థనీయం కాదు. జగన్ హయాంలో దాడులైనా, చంద్రబాబు హయాంలో దాడులైనా.. సభ్య సమాజం హర్షించకూడదు.

పైసలిస్తే, ముద్రగడ పద్మనాభ రెడ్డి నుంచి లేఖలొస్తాయ్.. అన్నది చాలాకాలంగా వినిపిస్తున్నమాటే.! ఇంతకీ, తాజాగా విడుదలైన లేఖ కోసం ముద్రగడ పద్మనాభ రెడ్డికి వైసీపీ ఎంత పైకం చెల్లించిందో.?

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group