Nabha Natesh Ismartu.. ఇస్టార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పట్టు వదలని విక్రమార్కురాలిలా దాడి చేస్తూనే వుంది. అదేనండీ తనలోని హోయలన్నీ, పోగేసి.. అందాల దాడి చేస్తోంది.
ఏం చేసినా అదంతా అవకాశాల కోసమే కదా. ఎందుకో తెలీదు ఆ అవకాశాలే నభా నటేష్ తలుపు తట్టడం లేదు. ఇంకేముంది.! ‘ఇస్టార్ట్ శంకర్’తో దశ తిరిగిపోయిందనుకున్నారంతా.!
కానీ, ‘ఇస్మార్ట్’ బ్యూటీ అంటూ తన పేరుకు ముందు స్మార్ట్ తగిలించుకుంది కానీ, ఆ స్మార్ట్‌నెస్ నభా నటేష్ (Nabha Natesh) కెరీర్‌లో ఎంత వెతికినా కనిపించడం లేదు.
Nabha Natesh Ismartu.. పేరులో వుంటే చాలదమ్మా.!
స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ స్టామినా వుందీ ఇస్మార్ట్ బేబీలో. కానీ, లక్కు నక్క తోక తొక్కడం లేదే.! నభా నటేష్(Nabha Natesh) విషయంలో.
తాజాగా నభా నటేష్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌తో వున్న ఈ పిక్స్‌లో నభా నటేష్ ఎక్స్‌ప్రెషన్సే హైలైట్.

అలా అని అందాల విందుకు ఏమాత్రం లోటు లేదండోయ్. కుర్రోళ్లను మత్తులో నభా నటేష్ (Nabha Natesh) ముంచేస్తోంది తన ఖతర్నాక్ చూపుల్తో.
ఇంతందాన్ని మన టాలీవుడ్ ఎందుకిలా మిస్ చేసుకుంటోందబ్బా.! అని గగ్గోలు పెడుతున్నారు నభా నటేష్(Nabha Natesh) అభిమానులు.
Also Read: శ్రీలీల బర్త్ డే గిఫ్ట్.! రైస్ కుక్కర్.? దోమల బ్యాట్.?
ఒక్క ఛాన్స్.! ఒకే ఒక్క ఛాన్స్.. లేదంటే, ఓ స్పెషల్ ఛాన్స్..! అదేనండీ.! ఐటెమ్ సాంగ్ అయినా ఓకే అంటోందట నభా నటేష్.
టైమ్ బ్యాడ్ అంటే ఇదే మరి.! అయినా, కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇదిగో, ఇలాగే కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది.

అందానికి అందం.. గ్లామరుకి గ్లామర్.. అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది నభా నటేష్ పరిస్థితి.
అన్నట్టు, ఆ మధ్య ఓ యాక్సిడెంట్ కారణంగా, కొంత కాలం పాటు సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందట నభా నటేష్‌కి. అదే తన కెరీర్ మీద పెద్ద దెబ్బ వేసిన ఘటన.. అని అంటోందామె.