Nabha Natesh Rainy Beauty.. వర్షంలో తడవడం అంటే ఎవ్వరికిష్టముండదు చెప్పండి. అయితే వర్షంలో తడుస్తూ.. ఇలా అందంగా ఫోటోలు తీయించుకుంటే అదింకెంత బావుంటుందో కదా.!
అందాల భామ నభా నటేష్ అదే చేసింది. చక్కటి చీరకట్టులో వర్షంలో తడిసి ముద్దవుతూ చేయించుకున్న ఈ ఫోటో షూట్‌తో నెటిజన్ల మనసులు దోచేసుకుంటోంది.
నీలీ రంగు చీరలో.. ఈ నెరజాన అందచందాలకు సోషల్ మీడియా షేకవుతోందంటే చిన్న మాట కాదు. గతేడాది నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ సినిమా గుర్తుందిగా.
అదే నభా కెరీర్‌కి పెద్ద లోటేమో.!
ఆ సినిమా కోసం రక రకాల వేరియేషన్స్ వున్న పాత్రల్లో నటించి నభా నటేష్ తనలోని నటికి మరింత పదును పెట్టింది.

అయితే, ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేదనుకోండి. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న నభా నటేష్.. ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయింది.
దురదృష్టవశాత్తూ జరిగిన ఓ యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా వుండాల్సి వచ్చింది. అది ఆమె కెరీర్‌కి పెద్ద ఆటంకంగానే చెప్పొచ్చు.
Nabha Natesh Rainy Beauty.. చిటపట చినుకుల్లో.. చీర తళుకులు..
అయితేనేం, ఆ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చింది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో కొత్తగా సరికొత్తగా ఎట్రాక్ట్ చేసింది.
అలా అడపా దడపా వచ్చిన సినిమా ఛాన్సులు అందిపుచ్చుకుంది. కానీ, అవేమీ నభా కెరీర్‌కి పెద్దగా యూజ్ కాలేదు. మంచి రోల్ దొరికితే చెలరేగిపోదామనుకుంటోంది.

ఏమాట కా మాటే చెప్పాలి.. ఆ నీలి చీరలో నభా మేని ఛాయ, ఎక్స్‌ప్రెషన్, బ్యాక్ గ్రౌండ్ కలర్ కాంబినేషన్.. అన్నీ ఒకదానికొకటి పోటీ పడుతూ ఎలివేట్ అవుతున్నాయ్.
Also Read: కన్యాకుమారి సమీక్ష.! సిక్కోలు ‘సిన్నది.. సిన్నోడు’ బావున్నారు.!
చిట పట చినుకులు పడుతూ వుంటే.. ఆ చినుకుల్లో తడుస్తూ.. నభా వంటి అందగత్తెలిలా పోజిస్తుంటే.. చూసేందుకు చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా వుంటుందోయీ.!
