Naga Chaitanya Divyansha Kaushik.. అక్కినేని నాగచైతన్యకీ పలువురు హీరోయిన్లకీ మధ్య ‘లింకులు’ పెట్టి గాసిప్స్ సృష్టించడం అనేది ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతోంది. ఎందుకు.?
నటి సమంతతో అక్కినేని నాగచైతన్యకి గతంలో వివాహం జరిగింది. కానీ, ఆ వైవాహిక బంధం కొన్నాల్ళ క్రితమే తెగిపోయింది.
‘మ్యూచువల్ అండర్‌స్టాండింగ్’తో సమంత, నాగచైతన్య (Akkineni Naga Chaitanya) విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
తెలుగమ్మాయ్‌తో భంచిక్..
తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ‘భంచిక్’ అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇద్దరూ వెకేషన్లకి వెళుతున్నారంటూ గాసిప్స్ వస్తున్నాయి.
అయితే, ఈ విషయమై అటు శోభిత (Sobhita Dhulipala) ఖండించలేదు.. నాగచైతన్య కూడా ఖండించలేదు. అలాగని, తమ మధ్య ఏదో వుందన్న ప్రచారాన్నీ వీరు ‘నిజమే’ అని చెప్పడంలేదు.
ఇంతలోనే ఇంకో భామ పేరు రంగంలోకి దిగింది. ఆమె ఎవరో కాదు ‘మజిలీ’ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్.
Naga Chaitanya Divyansha Kaushik.. ఆమె వల్లనే విడాకులట..
దివ్యాన్ష (Divyansha Kaushik) నటించిన తొలి తెలుగు సినిమా ‘మజిలీ’. ఈ సినిమాలో నాగచైతన్య, సమంత జంటగా నటించారు.
అప్పుడే దివ్యాన్షతో నాగచైతన్యకు ఎఫైర్ స్టార్ట్ అయ్యిందనీ, అదే నాగచైతన్య – సమంత (Samantha Ruth Prabhu) విడిపోవడానికి కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.
‘నాగచైతన్య (Akkineni Naga Chaitanya) మంచోడు, అందాడు. అతని మీద క్రష్ వుంది. ఐ లవ్ హిమ్. కానీ, ఆయనతో ప్రేమలో పడ్డాడననేది నిజం కాదు. ప్రొపెషన్ పరంగా పరిచయం మాత్రమే..’ అని తేల్చేసింది దివ్యాన్ష కౌశిక్.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
ప్రచారంలో వున్నట్లుగా నాగచైతన్య తనకు ఏమీ సినిమా అవకాశాలు ఇప్పించలేదనీ, ఆయనతో టచ్‌లో లేననీ దివ్యాన్ష క్లారిటీ ఇచ్చేసింది.
అయినాగానీ.. నాగచైతన్యకీ దివ్యాన్షకీ మధ్య ఏదో వుందన్న ప్రచారమైతే ఆగడంలేదు. నాగచైతన్య ఎలాగూ ఇలాంటి రూమర్లకు స్పందించడు. సో, వస్తూనే వుంటాయ్ ఈ గాలి వార్తలు ఓ ప్రవాహంలా.!