Table of Contents
Naga Vamsi Indian2 Thatha.. సినీ నిర్మాత నాగవంశీ, తన తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రెస్ మీట్ పెట్టారు.. ఈ సందర్భంగా మీడియాని ఏకి పారేశారు.!
ఇంతకీ, నాగవంశీని అంతగా ఇబ్బంది పెట్టిన విషయమేంటి.? ‘ఫ్లూక్’ అంటూ, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా మీద ఓ సీనియర్ సినీ ఎర్నలిస్ట్ వెటకారం చేయడం.
పక్క సినిమా (రాబిన్ హుడ్) పోయింది కాబట్టి, ‘మ్యాడ్ స్క్వేర్’ హిట్టయ్యిందంటూ, సదరు సినీ ఎర్నలిస్టు ఈ కామెంట్ చేయడాన్ని నిర్మాత నాగవంశీ జీర్ణించుకోలేకపోయారు.
Naga Vamsi Indian2 Thatha.. ఇండియన్ 2 తాత ఎవరు.?
‘మేం సినిమాలు తీయడం వల్లే మీకు కంటెంట్ దొరుకుతోంది’ అన్నది నాగవంశీ కామెంట్.
అంతే కాదు, ‘నాకు మీ నుంచి ఎలాంటి సాయం అవసరం లేదు. మీరు నా సినిమాలకు సంబంధించిన వార్తలు రాయొద్దు. రివ్యూలు అసలే ఇవ్వొద్ద’ అని నాగవంశీ అల్టిమేటం జారీ చేశారు.
అక్కడితో ఆగలేదు, ‘నా యాడ్స్ కూడా మీరు అడగొద్దు’ అని నాగవంశీ, సదరు ఎర్నలిస్టుతోపాటు, కొన్ని వెబ్ సైట్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.
నాగ వంశీ గుస్సా..
ఇంతలా నాగవంశీ గుస్సా అవడం, చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి, ఈ తరహా వ్యవహారాలు సినీ పరిశ్రమలో కొత్త కాదు.
తమ తమ సినిమాల విషయమై జరిగే దుష్ప్రచారాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేరు. కొందరు సీరియస్‌గా స్పందిస్తారు, కొందరు శాంతంగా తెరవెనుక వ్యవహారాలు చక్కబెడతారు.
ఇంతకీ, నాగవంశీ ఇంత సీరియస్ అయ్యారు కదా.. ఇకపై, సదరు సినీ ఎర్నలిస్టుని దూరం పెడతారా.?
‘దమ్ముంటే నన్ను, నా సినిమాల్ని బ్యాన్ చెయ్యండి’ అంటూ సవాల్ విసిరిన దరిమిలా, సదరు మీడియా సంస్థ, నాగవంశీ సినిమాల్ని బ్యాన్ చేస్తుందా.?
సినిమాటిక్ సెటిల్మెంట్లు..
ఛత్.. ఇవన్నీ జరిగే పనులు కావు. మీడియా ముందు రెచ్చిపోవడం, తెరవెనుకాల సెటిల్మెంట్లు చేసుకోవడం.. ఇదంతా షరామామూలు వ్యవహారమే.
గతంలో సదరు సీనియర్ ఎర్నలిస్టుతోనూ, సదరు మీడియా సంస్థతోనూ సినీ పరిశ్రమలో చాలామందికి చాలా పంచాయితీలు నడిచాయి. కానీ, షరామామూలు బ్లాక్‌మెయిల్ ఎర్నలిజం అటువైపు నుంచి నడుస్తూనే వుంది.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
‘ఇండియన్ 2 తాత’ అంటూ, నాగవంశీ నేరుగానే ఆ సీనియర్ ఎర్నలిస్టు మీద ఎటాక్ చేయడంతో అతనెవరన్నది అందరికీ తెలిసిపోయింది.
దాంతో, ‘ముసలి గాడిదని అడ్డంగా మేపితే.. లాగి తన్నింది’ అని సినీ మీడియా వర్గాల్లోనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, తనను నాగవంశీ తిట్టబోతున్నట్లు, ఆ సీనియర్ ఎర్నలిస్ట్.. అదే, ఆ ‘ఇండియన్ 2 తాత’ ముందుగానే, ట్వీటెయ్యడం.