Nagababu About Ali.. మీడియా ఏవేవో అడుగుతుంటుంది. మీడియా మైకు కన్పిస్తే, ఏదో ఒకటి మాట్లాడేయాలనుకుంటే.. అది ఆయా వ్యక్తుల స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది.
పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారా.? అంటే, ‘అధినేత వైఎస్ జగన్ ఆదేశిస్తే..’ అంటూ సినీ నటుడు అలీ ఈ మధ్యనే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అయినా, పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడమేంటి.? ప్రజా ప్రతినిథిగా ప్రజలకు సేవ చేయాలనుకుంటే.. ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు.!
నిజానికి, మీడియా అడిగిన ప్రశ్ననే అర్థం పర్థం లేనిది. సినిమా రంగంలో చాలా అనుభవం వున్న అలీ, ‘పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తారా.?’ అన్న ప్రశ్నకు క్లీన్ బౌల్డ్ అయిపోవడమేంటో.?
నో కామెంట్.. ఆ ప్రశ్నకు విలువ లేదు.!
మెగా బ్రదర్ నాగబాబు అయితే, అలీ వ్యాఖ్యల్ని ఖండించలేదు. పవన్ కళ్యాణ్ మీద అలీ పోటీ చేస్తారట కదా.? అని మీడియా అడిగితే, ‘నో కామెంట్’ అనేశారు.

అంతే కాదు, ‘ఆ ప్రశ్నకు విలువ లేదు..’ అని నాగబాబు వ్యాఖ్యానించడం ద్వారా, ఇటు మీడియాకి.. అటు అలీకి ఒకేసారి కౌంటర్ ఎటాక్ ఇచ్చినట్లయ్యింది.
సినీ నటుడిగా అలీకి చాలా పేరుంది. కానీ, ఏం లాభం.? ఒక్కసారిగా తన స్థాయిని దిగజార్చేసుకున్నాడు, ‘జగన్ ఆదేశిస్తే..’ అనడం ద్వారా.!
డైమండ్ రాణి వ్యవహారంలోనూ..
రోజాని డైమండ్ రాణిగా పవన్ అభివర్ణించారు కదా.? అని అలీని అడిగితే, డైమండ్ గొప్పతనం గురించి చెప్పే ప్రయత్నలో అలీ పొలిటికల్ కమెడియన్ అయిపోయాడాయె.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
‘నో కామెంట్’ అని అలీ అనగలిగి వుంటే, అతనికే హుందాతనం అయ్యేది.! నాగబాబు ‘నో కామెంట్’ అనడం ద్వారా హుందాతనం పెంచుకుంటే, అలీ నవ్వులపాలైపోయాడు.!