Nagababu Moral Policing Women.. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరించాలి.? అన్న డిబేట్.. మగాళ్ళ వైపు నుంచి వస్తుండడం ఒకింత అభ్యంతకరమే.!
అలాగని, అసభ్యకరమైన దుస్తులు ధరిస్తే.. మగవాళ్ళనైనా, ఆడవాళ్ళనైనా.. ప్రశ్నించే పరిస్థితి ఖచ్చితంగా వుంటుంది.!
ప్రగతి శీల మహిళ.. పేరుతో, అభ్యంతకర వస్త్రధారణలో ఇష్టమొచ్చినట్లు తిరుగుతామంటే.. మనుషులకీ, జంతువులకీ తేడా ఏముంటుంది.? అన్నది మహిళల వైపు నుంచే వస్తున్న ప్రశ్న.
అదే సమయంలో, మహిళల వస్త్రధారణ విషయమై మగాళ్ళ మోరల్ పోలీసింగ్ కూడా సరికాదు.! ఏది తప్పు.? ఏది ఒప్పు.? అనేది ఇలాంటి విషయాల్లో తేల్చడం కష్టం.
కష్టమే కాదు, అసాద్యం కూడా.! విడవమంటే పాముకి కోపం.. కరవమంటే కప్పకి కోపం.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
సినీ నటి నిధి అగర్వాల్, ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొని, తిరిగి వెళుతున్న సమయంలో.. ఆమెపై ఎగబడ్డారు జనం. ఆ ఘటనపై, సినీ నటుడు శివాజీ స్పందించాడు.
అయితే, శివాజీ స్పందన సందర్భంగా కొన్ని తప్పుడు మాటలు దొర్లాయి. అదే మొత్తం వివాదానికి కారణం. మహిళల వస్త్రధారణపై కామెంట్ చేసే హక్కు శివాజీకి ఎక్కడిది.? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది.
శివాజీని అందరూ తిడుతున్నారు.. కొందరు ఆయన్ని వెనకేసుకొస్తున్నారు కూడా.! ఈ వ్యవహారంలో తలదూర్చిన అనసూయకీ అక్షింతలు పడుతున్నాయి.. ఆమెకీ ప్రశంసలు దక్కతుున్నాయి.
సందట్లో సడేమియా, సినీ నటుడు అలాగే నిర్మాత కూడా అయిన, జన సేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా సోషల్ మీడియా వేదికగా ‘మోరల్ పోలీసింగ్ సబబు కాదు’ అంటూ కామెంట్ చేశారు.
అంతే, వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుందిప్పుడు. నాగబాబుని విమర్శించే క్రమంలో, జన సేన పార్టీ మీద కొందరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
వివాదం ఇలా, ఇటు వైపు.. అదీ, జన సేన వైపు తిరుగుతుందని నాగబాబు ఊహించలేకపోయారా.? అంటే, అంత అమాయకుడైతే కాదాయన.!
కాకపోతే, స్పందించాల్సిన బాధ్యత సినీ నటుడిగా తన మీద వుందని బహుశా నాగబాబు స్పందించి వుండొచ్చు. కానీ, ఒక్కసారిగా నాగబాబుకి వ్యతిరేకులు, శివాజీ ఫ్యాన్స్.. పుట్టుకొచ్చేశారు.
నిజానికి, నాగబాబు చెప్పింది కరెక్టే.. మహిళల వస్త్రధారణపై మోరల్ పోలీసింగ్ కరెక్ట్ కాదు.! కానీ, రాజ్యంగం.. అంటూ నాగబాబు ప్రస్తావనలే ఒకింత ‘అతి’ అనిపిస్తున్నాయి.
నాగబాబు వ్యాఖ్యల దుమారంపై జన సేన ఎటూ పీక్కోలేకపోతోందిప్పుడు.!
