Nagababu Roja నాగబాబుకి కోపమొచ్చింది.! తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద సినీ నటి, వైసీపీ నేత రోజా చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసిన నాగబాబు, రోజాపై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదనీ, పర్యాటక శాఖను అభివృద్ధి చేయడమని నాగబాబు ఎద్దేవా చేయడం గమనార్హం.
Nagababu Roja మునిసిపాలిటీ కుప్ప తొట్టి..
ఇంతకాలం పవన్ కళ్యాణ్ మీదా, చిరంజీవి మీదా రోజా విమర్శలు చేస్తున్నా తాను స్పందించకపోవడానికి ఒకే ఒక్క బలమైన కారణం వుందన్నారు నాగబాబు.
‘నోరు కాదు అది మునిసిపాలిటీ కుప్ప తొట్టి. చూస్తూ చూస్తూ ఎవడూ దాన్ని కదిలించాలనుకోడు..’ అంటూ రోజాపై నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాజకీయాల్లో విమర్శలు సహజమే. కాకపోతే, రోజా ఇంకాస్త ఎక్కువగా స్పందిస్తుంటారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. ఆ స్థాయికి ఎవరూ దిగజారలేరని కాదు.. కానీ, కొంతమంది సంయమనం పాటిస్తుంటారు.
మంత్రిపై అలాంటి విమర్శలా.?
రోజా ప్రస్తుతం మంత్రి.. అలాంటి వ్యక్తిపై ‘కుప్ప తొట్టి’ అంటూ జుగుప్సాకరమైన విమర్శలెలా చేస్తారన్నది వైసీపీ మద్దతుదారుల వాదన.
Also Read: రాజకీయం రోడ్లపై కాదు.! తుప్పల్లో, డొంకల్లో.!
మరి, మంత్రి పదవిలో వుండి బూతులు తిట్టొచ్చా.? అనే ప్రశ్నలు వైసీపీ మీదకు దూసుకొస్తున్నాయనుకోండి.. అది వేరే సంగతి.
‘కుప్ప తొట్టి’ అని పార్లమెంటరీ పదాలే నాగబాబు వాడారు. కానీ, రోజాకి అలాంటి ఇబ్బందులేమీ వుండవ్. ఆమె నాగబాబుపై ఎలా స్పందిస్తారన్నది ఊహించుకోవడానికే కష్టంగా వుంటుంది.
మీడియా మైకులు పగిలిపోయేలా.. సభ్య సమాజం చెవులు బద్దలయ్యేలా వుంటాయ్ రోజా విమర్శలు. గెట్ రెడీ.!