Nagachaitanya Samantha Sobhita.. అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి, పెళ్ళి చేసుకుని.. కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులతో వేరుపడ్డారు. ఎవరి దారి వారిదే అయ్యింది.
సమంత పలు సినిమాలతో బిజీగా వుంది. నాగచైతన్య కూడా అంతే.! ఇద్దరూ ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా వున్న సమయంలో.. వీళ్ళ చుట్టూ సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున ట్రోలింగ్ జరుగుతోంది.
సమీప భవిష్యత్తులో సమంత ఇంకో పెళ్ళి చేసుకుంటుందా.? అంటే, ఎందుకు చేసుకోకూడదు.? అలాగే, నాగచైతన్య కూడా మరో పెళ్ళి చేసుకుంటాడు. ఇందులో సందేహం ఏముంటుంది.?
కానీ, నెటిజనం.. ఆ ఇద్దర్నీ వాళ్ళ వాళ్ళ పనుల్ని చేసుకోనిస్తారా.? వెబ్ మీడియా ఊరుకుంటుందా.? మెయిన్ స్ట్రీమ్ మీడియా సైలెంటుగా వుంటుందా.? సోషల్ మీడియా చెలరేగిపోకుండా వుంటుందా.?
Nagachaitanya Samantha Sobhita అసలేంటి కథ.?
నిత్యం సమంత, నాగచైతన్య చుట్టూ రకరకాల కల్పిత కథలు పుట్టుకొస్తూనే వున్నాయి. మసలా దట్టించి, పాత గాసిప్పుల్ని, కొత్త కథనాలుగా వండి వడ్డించేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయా గాసిప్స్ విషయంలో ఒక్కోసారి సమంత (Samantha Ruth Prabhu) గుస్సా అవుతుంటుంది. ఔను మరి, ఆ స్థాయిలో ఆమెకు ‘సోషల్’ వేధింపులు ఎదురవుతున్నాయ్.
కానీ, నాగచైతన్య మాత్రం పూర్తిగా లైట్ తీసుకున్నాడు. అయితే, ఈసారి లైట్ తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది. నేడో, రేపో నాగచైతన్య జరుగుతున్న వ్యవహారాలపై స్పష్టత ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
తెరవెనుకాల కథ నడిపిస్తున్నదెవరు.?
సమంత – నాగచైతన్య వ్యవహారంలోకి తెలుగమ్మాయ్ శోభిత ధూలిపాళని (Sobhita Dhulipala) లాగారు. ఆమె సైతం, తన మీద జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించే అవకాశాల్లేకపోలేదు.
ఇదిలా వుంటే, జరుగుతున్న పరిణామాలపై అక్కినేని కాంపౌండ్ గుస్సా అవుతోందిట. పనిగట్టుకుని నాగచైతన్యను వివాదాల్లోకి ఎవరు లాగుతున్నారనేది తేలాల్సి వుంది.
Also Read: కిరికెట్టూ.. కనికట్టూ ఏంటో ఆ సీక్రెట్టూ.!
అందుకే, ఈ దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారన్నదానిపై అక్కినేని కాంపౌండ్ ఆరా తీస్తోందట.
మరోపక్క, సమంత సైతం తనను సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్న వైనంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శోభిత ధూలిపాళ కూడా ఇదే తరహాలో ఆలోచనలు చేస్తోందిట.