Nandamuri Balakrishna Ground Floor.. బాలయ్య అంతే.! చిన్న పిల్లాడి మనస్తత్వం.! దేన్నీ మనసులో దాచుకోలేరు.! అభిమానాన్ని అయినా, కోపాన్ని అయినా.!
అభిమానుల అత్యుత్సాహాన్నీ ఆయన తట్టుకోలేరు. చాచిపెట్టి లెంపకాయ గట్టిగా ఇచ్చేస్తుంటారు అప్పుడప్పుడూ అభిమానులకి.! అది కాస్తా వివాదాస్పదమవుతుంటుంది.
‘అబ్బే, బాలయ్య కొట్టరు.. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం’ అంటూ ఇంకో సినీ ప్రముఖుడు, బాలయ్య ‘కొట్టుడు’ గురించి తాజాగా చెప్పుకొచ్చాడనుకోండి.. అది వేరే సంగతి.!
Nandamuri Balakrishna Ground Floor.. గ్రౌండ్ ఫ్లోర్.. అలియాస్ డిక్కీ బలిసిపోవడం.!
అసలు విషయమేంటంటే, నందమూరి బాలకృష్ణకి గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందట.! గ్రౌండ్ ఫ్లోర్ అంటే తెలుసు కదా.?
వైసీపీ నేత, మంత్రి రోజా భాషాలో చెప్పాలంటే ‘డిక్కీ’ అన్నమాట.! అదేనండీ, డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్ళి.. అని ఆమె సెటైర్లు వేస్తుంటారు తరచూ.!
ఇంతకీ, బాలయ్యకి గ్రౌండ్ ఫ్లోర్ ఎందుకు బలిసినట్టు.? అలా బలిసిపోవడం వల్లే, యంగ్ హీరోయిన్ శ్రీలీలతో కలిసి ఓ సినిమా చేయాలని బాలకృష్ణ అనుకున్నారట. అదేంటీ, ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నారు కదా.? అంటే, ఇది వేరు.!
శ్రీలీల హీరోయిన్‌గా.. బాలయ్య హీరోగా సినిమా అన్నమాట.! ఈ చిలిపి ఆలోచన బాలయ్యకు వచ్చిందట.. అదే విషయాన్ని కుటుంబ సభ్యులతోనూ బాలయ్య చెప్పారట.
తండ్రి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆలోచన గురించి తెలుసుకున్న తనయుడు మోక్షజ్ఞకి కోపం వచ్చిందట.

‘ఆమె చాలా చిన్న పిల్ల.. ఆమెతో మీరు హీరోగా సినిమా చేయడమేంటి.? ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేద్దామనేనా.?’ అన్న కోణంలో మోక్షజ్ఞ అసహనం వ్యక్తం చేశాడట.
‘నీకేమన్నా గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా నాన్నా.?’ అని ప్రశ్నించేశాడట నందమూరి మోక్షజ్ఞ.
ఇదంతా ఎవరో చెప్పింది కాదు, స్వయంగా బాలకృష్ణ చెప్పిందే. పెంపకం మరీ ఇంత ఛండాలంగా వుందేంటి.?
తండ్రిని.. ఏ కొడుకు అయినా అలా అనగలడా.?
తండ్రిని అంత మాట ఏ కొడుకన్నా అంటాడా.? అయినా, అందులో తప్పేముంది.? అని నెటిజనం ట్రోల్ చేస్తున్నారు. తనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళయిన హీరోయిన్లతో బాలయ్య ఎన్ని సినిమాలు చేయలేదు.?
Also Read: లక్కీ ఛాన్స్ పట్టేసిన మీనాక్షి చౌదరి.!
ఏదో సరదాకి బాలయ్య, ‘గ్రౌండ్ ఫ్లోర్’ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినా, దానికి ‘మోక్షు’ పేరుని తగిలించడం ద్వారా, నందమూరి మోక్షజ్ఞ ఇజ్జత్‌ని స్వయంగా బాలయ్యే తీసేసినట్లయ్యింది.
నందమూరి బాలకృష్ణ అంటే, కేవలం సినీ నటుడు కాదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూడా.! కాస్తంత బాధ్యతగా వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు.!