Nandamuri Balakrishna In Danger.. నందమూరి బాలకృష్ణకి ‘విశ్వాసాలు’ చాలా చాలా ఎక్కువ. దేవుడిపై విపరీతమైన భక్తి. అలాగే, నమ్మకాలనండీ.. మూఢ నమ్మకాలనండీ.. అవీ ఎక్కువే.!
తెల్లవారు ఝామునే లేచి, సంప్రదాయ బద్ధంగా ఇంట్లోనే పూజలు చేయడం బాలకృష్ణకి అలవాటు. సినిమా ప్రారంభం దగ్గర్నుంచి విడుదల వరకు.. అన్నిటికీ ముహూర్తాలు బాలయ్యే చూసుకుంటారట.
బాలయ్యకు నిజంగానే ప్రమాదం పొంచి వుందా.? ఆ విషయాన్ని ఆ దైవమే ఇలా కురూపిలా వచ్చి చెప్పి హెచ్చరించిందా.?
Mudra369
ఇక, ఇంట్లోంచి కాలు తీసి బయట పెట్టాలన్నా ముహూర్తాలను పక్కాగా పాటిస్తారట బాలకృష్ణ.
Nandamuri Balakrishna In Danger.. బాలయ్యకు ప్రమాద హెచ్చరిక.?
నందమూరి తారకరత్న అంత్యక్రియల సమయంలో ఓ వ్యక్తి బాలకృష్ణ దగ్గరకు వచ్చి, ఏవేవో మాట్లాడి వెళ్ళాడు. ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
ఆ వ్యక్తి పిచ్చోడిలా కనిపించడమే అందుక్కారణం. ఎవరా వ్యక్తి.? అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజనం.
ఇంకోపక్క, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు కనిపిస్తున్నాయి. ‘ప్రమాదం పొంచి వుంది బాలయ్యా.. జర జాగ్రత్త..’ అంటూ బాలయ్యని ఆ మతి స్థిమితం లేని వ్యక్తి హెచ్చరించాడన్నది వాటి సారాంశం.
అన్నట్టు, బాలయ్యతో మతి స్థిమితం లేని వ్యక్తి మాట్లాడుతోంటే, ‘భైరవ ద్వీపం’ సినిమాలోని బాలయ్య ధరించిన కురూపి గెటప్ చాలామందికి గుర్తుకొచ్చింది.!
బాలయ్యకు నిజంగానే ప్రమాదం పొంచి వుందా.? ఆ విషయాన్ని ఆ దైవమే ఇలా కురూపిలా వచ్చి చెప్పి హెచ్చరించిందా.? అని బాలయ్య అభిమానులూ ఆందోళన చెందుతున్నారు.
ఇంతకీ, ఇందులో నిజమెంత.? బాలయ్యకే తెలియాలి.! బహుశా ఆ జనసందోహం మధ్యన బాలయ్యకూ, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అర్థమయి వుండకపోవచ్చన్నది ఇంకో వాదన.
పిచ్చోడి మాటలకు విలువెంత.?
మెయిన్ స్ట్రీమ్ మీడియా, వెబ్ మీడియా సైతం.. ఈ వీడియో చుట్టూ పెద్దయెత్తున రచ్చ చేస్తుండడం గమనార్హం.
మరీ, అంతలా పట్టించుకునే విషయమేనా ఇది.? అంటే, కాదేదీ కవితకనర్హం.. అన్నట్టు, ‘కాదేదీ బ్రేకింగ్ న్యూస్లకి అనర్హం’ అన్నట్టు మారింది పరిస్థితి.
Also Read: విజయసాయిరెడ్డితో ఎన్టీయార్.! ఇదేం రాజకీయమబ్బా.?
ఏమో, ఆ పిచ్చోడ్ని తీసుకొచ్చి యూ ట్యూబ్ ఛానళ్ళు లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా.. ఇంటర్వ్యూలు చేసేసినా చేసేయొచ్చు.
ఇది వైరల్ యుగం మరి.! ప్రతి విషయమూ వైరల్ ఎలిమెంటే.!