Nandamuri Balakrishna NBK 109.. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ షురూ అయ్యింది.
‘వాల్తేరు వీరయ్య’ ఫేం బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది.
బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్.. వయొలెన్స్ కా విజిటింగ్ కార్డ్.. అంటూ, నందమూరి బాలకృష్ణని ఎలివేట్ చేస్తూ, కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు తాజాగా.
హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ప్రస్తుతానికైతే ‘ఎన్‌బికె 109’ పేరుతో ఈ సినిమాని వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ‘భగవంత్ కేసరి’గా నందమూరి బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా, దసరా సీజన్ నేపథ్యంలో ‘మమ’ అనిపించేశారు.
‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’.. ఇలా మూడింటినీ హిట్ ఖాతాలో వేసేశారనుకోండి.. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, ‘ఎన్‌బికె 109’ కాన్సెప్ట్ పోస్టర్‌లో గొడ్డలి, ఆపై రేబాన్ కళ్ళద్దాలు.. ఓ లాకెట్.. ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయ్.
రేబాన్ కళ్ళద్దాల్లో కనిపిస్తున్న దృశ్యాలు, సినిమా కథపై రకరకాల గాసిప్స్‌కి కారణమవుతున్నాయ్.! అవేంటి.? అసలు సినిమా కథేంటి.? వేచి చూడాల్సిందే.!
అన్నట్టు, బ్లడ్ బాత్.. వయొలెన్స్.. అంటూ కాన్సెప్ట్ పోస్టర్ మీద పేర్కొనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? బాలయ్యని కాస్తంత సౌమ్యంగా చూపించండయ్యా.!