Nandamuri Kalyan Ram Devil.. అసలు గూఢచారి అంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలంటున్నాడు ‘డెవిల్’.!
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డెవిల్’. స్వాతంత్రోద్యమ సమయం నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న మూవీ ఇది.
కళ్యాణ్ రామ్ సరసన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘బింబిసార’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
Nandamuri Kalyan Ram Devil.. ఎవరీ డెవిల్.?
‘డెవిల్’ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ గూఢచారిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతని పాత్ర పేరు డెవిల్. సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయ్.
ఈ మధ్య ఈ తరహా పాత్రలతో సినిమాలు విరివిగా వస్తున్నాయి. కొన్ని అంచనాల్ని మించి విజయాన్ని సాధిస్తోంటే, కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయ్.
కాగా, కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ‘డెవిల్’ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు.
నందమూరి కళ్యాణ్ రామ్ స్టైలింగ్ అదిరింది. ఆయన డిక్షన్ కూడా వేరే లెవల్‌లో వుంది.
మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు
మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు
అదే గూఢచారి కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం..
DEVIL Kalyan Ram
‘డెవిల్’ గ్లింప్స్‌లో రామ్ చెప్పిన డైలాగ్, ఈ గ్లింప్స్ మొత్తానికీ స్పెషల్ ఎట్రాక్షన్.! త్వరలో ‘డెవిల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.!