Nandamuri Taraka Ramarao Sr.. స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల్ని ఏడాదిపాటు చేయబోతున్నట్లుగా సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
ఈ మేరకు బాలయ్య ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అందులో ఏడాదిపాటు చేయబోయే కార్యక్రమాలు, వాటిల్లో నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొనడం వంటి విషయాల్ని బాలయ్య ప్రస్తావించారు.
స్వర్గీయ నందమూరి తారకరామారావు నట వారసుడైన బాలయ్య, రాజకీయ వారసుడు మాత్రం కాలేకపోతున్నారన్న విమర్శ వుంది. విమర్శ మాత్రమే కాదు, నందమూరి అభిమానుల ఆవేదన కూడా.
Nandamuri Taraka Ramarao Sr.. అప్పుడలా.! ఇప్పుడేమో ఇలా.!
తెలుగుదేశం పార్టీని, స్వర్గీయ ఎన్టీయార్ స్థాపిస్తే, ‘నాయకత్వ మార్పు’ అంటూ అప్పట్లో స్వర్గీయ ఎన్టీయార్‌ని తప్పించి, తన సొంతం చేసుకున్నారు ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
అప్పట్లో స్వర్గీయ ఎన్టీయార్ (SR NTR), నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu) మీద చేసిన విమర్శల్ని తెలుగు నేల ఎలా మర్చిపోగలదు.?

‘జామాత దశమగ్రహ..’ అన్నారు, ఇంకేవేవో అన్నారు ఎన్టీయార్, తనను రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు గురించి.
కష్ట కాలంలో స్వర్గీయ ఎన్టీయార్ వెంట ఆయన కుటుంబ సభ్యులెవరూ లేని విషయాన్ని తెలుగు నేల అంత తేలిగ్గా మర్చిపోదు.
అదే ఎన్టీయార్ శత జయంతి వేడుకల్ని ఇప్పుడు అదే ఎన్టీయార్ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారని ప్రకటన విడుదల చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.!
మహా నాయకుడే.! కథానాయకుడే.! కానీ.!
ఇదిలా వుంటే, ‘తెలుగుదేశం పార్టీని (TDP) స్థాపించారు.. తెలుగు సంస్కృతి తల ఎత్తి నిలబడింది..’ అంటూ నందమూరి బాలకృష్ణ, అభిమానులకు రాసిన లేఖలో ఎన్టీయార్ గురించి పేర్కొనడంపైనా విమర్శలొస్తున్నాయి.
Also Read: కార్పొ‘రేటు’ కథ: కూతుర్ని చెల్లెలిగా ఏమార్చి ప్రాణం తీసింది.!
స్వర్గీయ ఎన్టీయార్ (Nandamuri Taraka Ramarao) తెలుగు నేలపై మహానాయకుడే, కథానాయకుడే.. కానీ, ఆయన వల్ల తెలుగు సంస్కృతి తల ఎత్తుకోవడమేంటి.? అన్న నిలదీత చాలామంది నుంచి వస్తోంది.