Nandamuri Taraka Ratna సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర నేడు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు తారకరత్న.
Nandamuri Taraka Ratna.. కార్డియాక్ ఆరెస్ట్.. ఆసుపత్రికి తరలింపు.!
లోకేష్ పాదయాత్రలో తారకరత్న పాల్గొనగా, కొద్ది సేపటికే ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు.
గత కొద్ది రోజులుగా వరుస రాజకీయ కార్యకలాపాలతో బిజీగా వుండడం వల్ల నీరసంతో తారకరత్న కింద పడిపోయినట్లు తొలుత అంతా భావించారు.

ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం కూడా తారకరత్నకి స్పృహ రాకపోవడంతో, హుటాహుటిన ఆసుపత్రికి ఆయన్ని తరలించారు.
Also Read: రెండు కళ్ళూ.! పిచ్చోళ్ళూ.! ఇదీ ‘అలగా’తనమంటే.!
ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్ జరిగినట్లు ధృవీకరించారు. సీపీఆర్ చేయడంతో తిరిగి ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందని వైద్యులు వెల్లడించారు.
కాగా, తారకరత్నకి మెరుగైన వైద్య చికిత్స అందించేలా అన్ని విషయాల్నీ ఆయన బాబాయ్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారు.