Nani Dasara Dialogue కొన్నాళ్ళ క్రితం విజయ్ దేవరకొండ వాడకూడని ఓ మాట వాడేశాడు.. అదీ ఓ సినిమా ఫంక్షన్‌లో. రాయడానికి వీల్లేని పదమది.
‘అలా ఎలా అంటావ్.?’ అంటూ విజయ్ దేవరకొండ మీద మండిపడుతూ మీడియాకెక్కింది అనసూయ భరద్వాజ్. అప్పట్లో అదో పెద్ద సంచలనం.
‘లైగర్’ సినిమా ఫెయిలయినప్పుడు, ఆనాటి ఆ వివాదాన్ని అనసూయ గుర్తు చేసుకుంది.
అన్నట్టు, విజయ్ దేవరకొండ నిర్మాణంలో రూపొందిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో అనసూయ నటించిందనుకోండి.. అది వేరే సంగతి.
Nani Dasara Dialogue ఏంటండీ నానీగారూ.!
‘బాంచోద్’ అనేది ఓ బూతు పదం. బెంగాలీ తిట్టు అది. దానర్థం ఇక్కడ రాస్తే అత్యంత జుగుప్సాకరం.
‘మీరెలా ఆ మాటని అనగలుగుతున్నారు.?’ అంటూ తాజాగా జర్నలిస్టుల నుంచి ఓ ప్రశ్న దూసుకెళ్ళంది నాని వైపుకి.
కాస్త కంగారు పడుతూనే, కవర్ డ్రైవ్ వేసే ప్రయత్నం చేశాడు నాని. ‘బాంచత్’ అంటే అది తిట్టు కాదు, సాధారణంగా మనం వాడే మాటేనంటూ నాని సెలవిచ్చాడు.
ఇంట్లో పిల్లలు ఇలాంటి బూతులకు అలవాటు పడతారు కదా.. సినిమా చూస్తే.? అన్నది జర్నలిస్టుల అభ్యంతరం.
‘దాని అర్థం బూతు కాదని మీరు చెప్పండి..’ అంటూ నాని తిరిగి జర్నలిస్టులకి తెలుగు పాఠాలు నేర్పే ప్రయత్నం చేశాడు.
ఇంతకీ, సెన్సార్ బోర్డు ఆ మాటకి ‘కత్తెర’ వేస్తుందా.? ఏమో మరి.!
Also Read: పవన్ కళ్యాణ్ బ్రహ్మచర్యం.! జాతీయ సమస్యే.?
ఈ ‘బాంచత్’ అన్న పదాన్ని ఈ మధ్య వెబ్ సిరీస్‌లలో బాగా వాడేస్తున్నారు. కానీ, నాని వాడాక.. దానర్థమేంటి.? అని గూగుల్ తల్లిని తెలుగు జనాలు అడిగేయడం మొదలైంది.