Nani Dasara.. నాని అంటే నేచురల్ స్టార్.! ఎందుకు.? అంటే, నాని అనగానే మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు గనుక.! మనలో ఒకడిలా అనిపిస్తాడు గనుక.!
ఈసారి నాని కంప్లీట్ మేకోవర్‌తో వస్తున్నాడు. అదొక కుగ్రామం.! పేరేమో వీర్లపల్లి అట.! చుట్టూ బొగ్గు కుప్పలట.! లిక్కర్ తాగడం ఓ సంప్రదాయమైపోయిందట.!
Nani Dasara మేకోవర్ అదిరింది.! మాస్ జాతరే.!
హై ఓల్టేజ్ యాక్షన్ ఈ మాస్ సినిమా నుంచి ఆశించొచ్చు. టీజర్‌తోనే ఆ ‘మాస్ కిక్కు’ చూసే జనాలకి బాగా ఎక్కేసేలా చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్.
ఈసారి దసరా.. మార్చి నెలలోనే వచ్చేస్తుందట. అంటే, మార్చి నెలలో ‘దసరా’ సినిమా విడుదల అన్నమాట. నాని సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ పిచ్ కూడా ఈ సినిమాలో చూపించడంతో, సినిమాపై ఇంకాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది.
చివర్లో నాని నోటితో కత్తిని పట్టుకుని.. ఆ కత్తి మీద తన చేతి బొటన వేలిని కోసుకుంటూ.. అలా వచ్చిన రక్తంతో నుదుటిన రక్తపు బొట్టుని దిద్దుకోవడం వేరే లెవల్ అంతే.!
Also Read: హరీష్ శంకర్ హర్టయ్యాడుట.! బుంగ మూతి పెట్టలేదేం.?
సినిమాటోగ్రఫీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అన్నీ వేరే లెవల్‌లో అనిపిస్తున్నాయ్. టీజరే ఇలా వుంటే.. ట్రైలర్ ఇంకెలా వుంటుందో.! సినిమా ఇంకెంత జాతరని తీసుకొస్తుందో.!
అన్నట్టు.. నాని నుంచి రానున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది.! ఇంతకు ముందు ‘అంటే సుందరానికీ’ తెలుగుతోపాటు తమిళ, మలయాళంలోనూ వచ్చినా.. ‘దసరా’ అంతకు మించి.!