Nani Paradise Glimpse.. సహజ నటనకు నిలువెత్తు నిదర్శనం నాని.! అందుకే, నేచురల్ స్టార్ నాని.. అని పిలుస్తుంటాం. మంచి మంచి కథల్నే ఎంచుకుంటున్నాడు నాని.!
ఈ క్రమంలోనే నాని నుంచి ‘ప్యారడైజ్’ పేరుతో ఓ సినిమా రాబోతోంది.! ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా, ఈ ‘ప్యారడైజ్’ నుంచి ఓ ప్రోమో వదిలారు.!
చూడ్డానికి, ఇది జస్ట్ ‘గ్లింప్స్’ మాత్రమే.! కానీ, అంతకు మించిన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కారణం, ఇందులోని ‘లం.. కొడుకు’ అనే ప్రస్తావన. అది కూడా, హీరో నానిని ఉద్దేశించి.
Nani Paradise Glimpse.. ఎందుకింత రిస్క్ తీసుకున్నావ్ నానీ.?
ఏకంగా, ‘లం.. కొడుకు’ అంటూ, నాని చేతి మీద పచ్చబొట్టు వేయించేశాడు దర్శకుడు. సినిమా కోసమే లెండి.. నిజంగా, పచ్చ బొట్టు కాదది. చదవడానికే, జుగుప్సాకరంగా వుంది కదా ‘లం.. కొడుకు’ అంటే.
రాయడానికి, ఇబ్బందికరంగా అనిపించింది కాబట్టే, ‘జ’ పదాన్ని తొలగించాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. అసలేంటి కథ.? ఎందుకీ ‘లం.. కొడుకు’ ప్రస్తావన.?
సినిమాలో ఎంత ఎంటెన్సిటీతో కూడిన సందర్భం అయినా అయి వుండొచ్చు. కానీ, మరీ ఇంతలాగనా.? ఇదే ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.
ఫ్యామిలీ ఆడియన్స్ దూరమైపోతేనో.?
నాని అభిమానుల్లో ఎక్కువమంది మహిళలే వుంటారు. ఫ్యామిలీ హీరో.. నాని అంటే.! కాదు కాదు, నాని అంటే పక్కింటి కుర్రాడు. చిన్న పిల్లలు ఇష్టపడతారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు.
అందుకే, ‘లం.. కొడుకు’ అన్న ప్రస్తావనని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.. అదీ, ‘నాని’ చేతి మీద ఆ పచ్చబొట్టు, అస్సలు మింగుడు పడటం లేదు ఎవరికీ.
Also Read: సినిమా టిక్కెట్టు.! వన్ ప్లస్ టూ ఆఫర్లు కూడా వస్తాయా.?
‘చంటబ్బాయ్’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నోట ఆ ప్రస్తావన వస్తుంది. అది చాలా ఎమోషనల్ సీన్. అయినాగానీ, అప్పట్లో దాన్ని చిరంజీవి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
మరిప్పుడు, నాని (Natural Star Nani) విషయంలో ఏం జరుగుతుంది.? అయినా, దర్శకుడు ఎలా నాని మీద ఆ ‘పచ్చబొట్టు ప్రయోగం’ చేసినట్టు.?