Table of Contents
Nara Lokesh Cheddy Politics.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! కానీ, వ్యవస్థలు మరీ అంత దిగజారాయా.? అన్నదే కాస్త ఆలోచించాల్సిన విషయం.!
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తన తల్లి భువనేశ్వరిపై నిండు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వాపోయారు.
యువగళం పాదయాత్రలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో నారా లోకేష్, ‘మన తల్లిని..’ అంటూ ఆనాటి ఆ ఘటనని ప్రస్తావించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని కట్ డ్రాయర్‌తో ఊరిగేస్తానంటూ శపథం కూడా చేసేశారు.
సాధ్యమేనా.?
ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు రాజకీయాలూ ఓ భాగమైపోయాయి. ఎవరు అధికారంలో వున్నా అదే తంతు నడుస్తోంది.
వైసీపీ (YSR Congress Party) హయాంలో పరిస్థితి మరింత దిగజారింది. తర్వాత వచ్చే ప్రభుత్వంలో పరిస్థితులు ఇంకా ఇంకా దిగజారతాయి.
ఏమో, టీడీపీ గనుక అధికారంలోకి వస్తే, నారా లోకేష్ ఆ ‘పని’ చేసి చూపిస్తారేమో.! కొడాలి నానిని గుడివాడలో కట్ డ్రాయర్‌తో నడి రోడ్డు మీద తిప్పుతారేమో.!
Nara Lokesh Cheddy Politics తేడా వస్తేనో.!
వైసీపీనే మళ్ళీ అధికారంలోకి వస్తే.. కొడాలి నాని గనుక మళ్ళీ మంత్రి అయితే.. ఈసారి ఆయనే, హోంమంత్రి అయితేనో.!
కట్ డ్రాయర్ వ్యవహారం, నారా లోకేష్ వైపుకు మళ్ళుతుందేమో.! అక్కడిదాకా ఎందుకు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే, ఇప్పుడే ఆ పని జరగొచ్చు.
వ్యవస్థలు ఏం చేస్తున్నాయి.? అనడగొద్దు.! అవంతే. వుంటాయంతే. పనిచేస్తున్నట్లు వుంటాయంతే.! చట్టం అధికార పార్టీ చెప్పిన పని చేసుకుంటూ పోతుందంతే.
చివరగా..
రాజకీయ నాయకులు, సభ్యతతో మాట్లాడాలి.. సంస్కారవంతంగా మెలగాలి. నారా లోకేష్ మాత్రమే కాదు, ఈ కట్ డ్రాయర్ పంచాయితీలోకి మాజీ మంత్రి పేర్ని నాని కూడా దూరారు.
కొడాలి నాని (YSRCP MLA Kodali Nani) మీద అలాంటి వ్యాఖ్యలు చేశావా.? ఆయన్ని లారీ క్లీనర్, కప్పులు కడిగినోడంటావా.? అంటూ లోకేష్ మీద మండిపడిపోయారు పేర్ని నాని.
Also Read: మూసుకుని చూడాల్సిందే! ‘చిరు’పై విజయ్ ‘మెగా’ కామెంట్స్!
కామెడీ కాకపోతే, నారా లోకేష్ (Nara Lokesh) కంటే ఎక్కువసార్లు పేర్ని నాని (Perni Nani), ‘లారీ డ్రైవర్.. కప్పులు కడిగేటోడు..’ అంటూ కొడాలి నానిని (Gudivada MLA Kodali Nani) పరోక్షంగా ర్యాగింగ్ చేసెయ్యడమేంటి.?
ఇదే కొడాలి నాని గతంలో టీడీపీ ఎమ్మెల్యే.! అప్పుడు చంద్రబాబుని దేవుడిలా కొలిచి, ఇప్పుడు ఆయన మీద జుగుప్సాకరమైన రీతిలో రాజకీయ విమర్శలు చేస్తున్నారు గుడివాడ ఎమ్మెల్యే.!
రాజకీయం అంటేనే అంత.! జనమే మధ్యలో వెర్రి వెంగళప్పలు.