Home » ముఖ్యమంత్రి పీఠంపై నారా లోకేష్.! సాధ్యాసాధ్యాలివీ.!

ముఖ్యమంత్రి పీఠంపై నారా లోకేష్.! సాధ్యాసాధ్యాలివీ.!

by hellomudra
0 comments
Nara Lokesh Visakhapatnma

Nara Lokesh CM Chair.. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు తర్వాత సీఎం అభ్యర్థి ఎవరంటే, నూటికి నూరు శాతం ఓటేసేది నారా లోకేష్‌కి మాత్రమే.

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి మంత్రి పదవి మీదనే ఆసక్తి లేదు.. ఆయన ముఖ్యమంత్రి పదవి గురించి అస్సలు ఆలోచించరు.

ఇక, మరో సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్, రాజకీయాల పట్ల అంత ఆసక్తితో లేరు. సో, ఎలా చూసినా నారా లోకేష్‌కి ముఖ్యమంత్రి పదవి విషయమై పోటీ లేదు.

అయితే, ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పుకుంటేనే, నారా లోకేష్ పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంలోకి వస్తుంది.

చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి పదవి గురించి సోషల్ మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్‌పై నారా లోకేష్ స్పందిస్తూ, ‘మా నాయకుడు చంద్రబాబు’ అని చెబుతుంటారు.

మంత్రి పదవికి ఎసరు పెట్టొద్దు..

ఓ సందర్భంలో అయితే, ‘నా మంత్రి పదవికి ఎసరు పెట్టకండి’ అంటూ, తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న టీడీపీ కార్యకర్తల ఆశలపై నీళ్ళు చల్లేశారు నారా లోకేష్.

ఇప్పుడిదంతా ఎందుకంటే, జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు వెళ్ళబోతున్నారనీ, ఈ క్రమంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనివార్యమనే చర్చ జరుగుతోంది కాబట్టి.

ఎవరు చేస్తున్నారు ఈ ప్రచారం.? అంటే, అది వేరే చర్చ. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది. ఆ కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ముఖ్యమంత్రి చంంద్రబాబు.

కూటమిలో టీడీపీ అత్యధిక సీట్లు కలిగిన పార్టీ. సీట్ల పరంగా జన సేనది రెండో స్థానం. మూడో స్థానంలో బీజేపీ వుంది. జనసేన, బీజేపీతో సంబంధం లేకుండా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగగలరు.

చంద్రబాబు తలచుకుంటే..

ఆ కోణంలో చూస్తే, తన కుమారుడిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడాలనుకుంటే, రాత్రికి రాత్రి నారా లోకేష్‌కి ముఖ్యమంత్రి పదవి దక్కుతుంది. తగిన ఎమ్మెల్యేల బలం టీడీపీకి వుంది కాబట్టి.

కానీ, గతంలోలా చంద్రబాబు, కూటమికి బీటలు వారేలా చెయ్యకపోవచ్చు. అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ సమీకరణాలు చాలా మారాయి.

సో, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాంటి రిస్క్ తీసుకోరు తనయుడు లోకేష్ విషయంలో.

నారా లోకేష్ కూడా, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలూ ఇప్పటికిప్పుడు తీసుకునే అవకాశం లేదు.

పూర్తి స్థాయిలో రాష్ట్రాభివృద్ధి జరగాలనీ, కూటమిగా వుంటేనే అది సాధ్యపడుతుందనీ కూటమిలో అన్ని పార్టీలూ భావిస్తున్నాయి.

అయితే, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.! సో, నారా లోకేష్‌కి ముఖ్యమంత్రి పదవి.. అనేది ఉత్త గాలి పుకారు.. అనుకోవడానికి వీల్లేదు. నిప్పు లేకుండా పొగ రాదు కదా.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group