Table of Contents
Nara Lokesh Pattabhishekam.. రాహుల్ గాంధీకి పట్టాభిషేకమెప్పుడు.? అన్న చర్చ గతంలో జరిగింది. నారా లోకేష్ పట్టాభిషేకమెప్పుడు.? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.
రాచరిక వ్యవస్థలో లేం కదా మనం.! ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం. సో, ఇక్కడ ప్రజా తీర్పుకి విలువ వుంటుంది తప్ప, రాచరికపు ఆలోచనలకు అర్థమే లేదు.
ప్రస్తుతం నారా లోకేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా వున్నారు. టీడీపీలో కీలక నేత.! అధినేత చంద్రబాబు తనయుడైన కారణంగా, నారా లోకేష్‌కి ‘చినబాబు’ అనే గుర్తింపు పార్టీలో దక్కడం సహజమే.
చంద్రబాబు తర్వాత, నారా లోకేష్ టీడీపీ బాధ్యతల్ని స్వీకరిస్తారా.? అంటే, దానికో ప్రజాస్వామిక ప్రక్రియ, పార్టీలోనే అంతర్గతంగా జరుగుతుంది.
Nara Lokesh Pattabhishekam.. ముఖ్యమంత్రి పదవి.. అదో పెద్ద బాధ్యత..
అలాంటిది, ముఖ్యమంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించాలంటే, ఇంకెంత పెద్ద కథ నడుస్తుంది.? రాహుల్ గాంధీని ప్రధానిగా సోనియా చూడాలని డిసైడ్ అయి వుంటే, ఎప్పుడో ఆ పని జరిగిపోయి వుండేది.
అక్కడ రాహుల్ గాంధీ అయినా, ఇక్కడ నారా లోకేష్ అయినా.. ప్రజలు ఇస్తేనే ‘కీలక’ పదవులు వచ్చేది. ప్రజా క్షేత్రంలో గెలవకుండానే, గతంలో లోకేష్ మంత్రి అయ్యారు కదా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.
నో డౌట్, పార్టీలో నెంబర్ టూ అంటే, నారా లోకేష్ మాత్రమే.! రోజు రోజుకీ పార్టీపై పట్టు మరింత పెంచుకుంటూ వెళుతున్నారు నారా లోకేష్.
సీనియర్లతో కొంత పంచాయితీ వుండేది లోకేష్‌కి ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. 2029 ఎన్నికల నాటికి, నారా లోకేష్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయిస్తారా.? అన్నది ఇప్పుడే చెప్పలేం.
భిన్నమైన పరిస్థితులు.. వ్యూహాత్మక రాజకీయాలు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వుందిప్పుడు.
ఎవరు భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్తి.? అన్న నిర్ణయం, 2029 ఎన్నికల నాటి పరిస్థితుల్ని బట్టి ఆధారపడి వుంటుంది.
ఆ సంగతి నారా లోకేష్‌కి కూడా తెలుసు. కొంతమంది టీడీపీ నాయకులు, అత్యుత్సాహంతో ‘కాబోయే సీఎం లోకేష్’ అని నినదించడంలో వింతేమీ లేదు.
కాలం కలిసొస్తే, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారేమో.! కానీ, ఇప్పుడే ఏదీ అంచనా వేయలేం. కూటమికి ఈలోగా చాలా బాధ్యతలున్నాయి.
వైసీపీ దుష్ప్రచారమేనా.?
లోకేష్ పట్టాభిషేకమంటూ వైసీపీ అను‘కుల’ మీడియా ప్రచారం చేయడం వెనుక వ్యూహం సుస్పష్టం.! ఇది కుట్రపూరిత వ్యూహమే.
కూటమిలో అంతర్గత కుమ్ములాటలకు ఈ ‘పట్టాభిషేకం’ చర్చ దారి తీస్తుందన్నది వైసీపీ వ్యూహం కావొచ్చు. కానీ, కూటమి పార్టీలు ఈ విషయమై చాలా అప్రమత్తంగానే వున్నాయి.
అన్నిటికీ మించి, నారా లోకేష్ పూర్తి స్పష్టతతో వున్నారు తన రాజకీయ భవిష్యత్తు విషయమై.! పూర్తి మెచ్యూరిటీతో వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారాయన.
