కరోనా వైరస్ దెబ్బకి మనిషి జీవితం గాల్లో దీపంలా తయారైంది. అమ్మ కడుపులో వుండగానే బోల్డన్ని మందుల్ని మింగేయాల్సిన పరిస్థితి. లేకపోతే, ఆ పుట్టుక కూడా సరిగ్గా వుండదు. పుట్టాక బతకాలంటే వీలైనంత ఎక్కువగా మందుల మీద ఆధారపడాల్సిందే. లేకపోతే, అదో సమస్య. మందులు ఎక్కువగా వాడేస్తే ఇంకో సమస్య. వాడకపోతే మరో సమస్య (Natural Immunity Leads To Happy And Healthy Life).
సహజ సిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థ మన శరీరంలోనే వృద్ధి చెందితే.. అది మనకు మేలు చేస్తుంది. వ్యాక్సిన్ల ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి పెంచుకుంటున్న రోజులివి. ఆ వ్యాక్సిన్ల వల్ల ఖచ్చితంగా దుష్ప్రభావాలు వుంటాయి.. స్వల్ప స్థాయిలో అయినా.
Also Read: ఆయుర్వేద వైద్యం VS మోడ్రన్ మెడిసిన్.!
ఇదిలా వుంటే, మనిషి ఆయుర్ధాయం పెంచే దిశగా పరిశోధనలు ఎప్పటినుంచో జరుగుతున్న విషయం విదితమే. తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే, మనిషి జీవితాన్ని వందేళ్ళ కంటే పైన.. అంటే 120 ఏళ్ళ వరకు పెంచొచ్చట.
మనిషి పుట్టుక, మరణం మధ్య శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం.. ఇలాగన్నమాట. వృద్ధాప్యాన్ని కాస్త వాయిదా వేయగలిగితే, ఆయుష్షు పెరిగినట్లే. నిజానికి, 120 ఏళ్ళ పాటు జీవించడం గురించి ఇప్పుడు కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు.
ఎలాంటి మందులూ వినియోగించకుండా, ఆరోగ్యకరమైన ఆహాపరపుటలవాట్లు, జీవన విధానంతో 110 ఏళ్ళు ఆ పైన కూడా జీవించినవారి గురించి వింటున్నాం. చాలా అరుదుగా కనిపించే విషయాలివి. కానీ, అలాంటివారి నుంచి మనం ఏం నేర్చకుంటున్నమాన్నదే ఇక్కడ అసలు సిసలు ప్రశ్న.
Also Read: Diabetes: వ్యాక్సిన్ ఎందుకు రాలేదు చెప్ప్మా.?
ఎప్పుడైతే ఆహారపుటలవాట్లు మారిపోయాయో.. అప్పుడే మనిషి జీవన చక్రం ఛిద్రమైపోవడం ప్రారంభమయ్యింది. చిన్నవయసులోనే క్యాన్సర్ బారిన పడటం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు.. ఇలా చాలా చాలా వింటున్నాం. సహజ సిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థని పెంచుకోగలిగితే, చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా వుండొచ్చు. వాటి కోసం పరిశోధనలు అవసరం లేదు.
మన అమ్మమ్మలు, తాతయ్యలు పాటించిన జీవన శైలిని అలవాటు చేసుకుంటే సరి. కానీ, దానికి ఎంతమంది సుముఖత (Natural Immunity Leads To Happy And Healthy Life) వ్యక్తం చేస్తారు.? ఒళ్ళు గుల్ల చేసేసుకుంటాం, అవసరమైతే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు వేయించేసుకుంటాం.. అనుకునేవారిలాగే.. 120 ఏళ్ళు బతికే అవకాశముందనగానే ఎగిరి గంతేస్తారు.. కానీ, అక్కడా కండిషన్స్ అప్లయ్.. అనే మాట వుంటుందని ఎంతమందికి తెలుసు.?