Tuck Jagadish – పాపం హీరో నాని. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఓటీటీలో డైరెక్టుగా విడుదల చేసుకోవాల్సి వస్తోంది. ‘వి’ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కరోనా మొదటి వేవ్ దెబ్బకి ‘వి’ ఓటీటీలో రిలీజైతే, రెండో వేవ్ దెబ్బకి ఇప్పుడు ‘టక్ జగదీష్’ ఓటీటీ వైపు చూడక తప్పలేదు.
సినిమాని థియేటర్లలో చూస్తే వచ్చే కిక్, ఇంట్లో ఎంత పెద్ద స్క్రీన్ మీద చూసినా రాదు. కానీ, తప్పదు. ‘వద్దు’ అన్న వారే, ‘ముద్దు’ అంటున్నారంటే, పరిస్థితులు అలాంటివి మరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో అవకాశమే లేదని హీరో నాని వాపోయాడు. ఈ క్రమంలో తన మీద కొందరు చేసిన విమర్శలు బాధించాయనీ అన్నాడు.
Tuck Jagadish Natural Star Nani – ఎవరికీ రాకూడని కష్టమిది
అంతేనా, ‘పరిస్థితులు బాగున్నప్పుడు కూడా, సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయాల్సి వస్తే, సినిమాల నుంచి నా మీద నేనే బ్యాన్ విధించుకుంటాను..’ అంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు నాని. ‘టక్ జగదీష్’ ట్రైలర్ విడుదల సందర్భంగా అందరూ ఓటీటీకి వ్యతిరేకంగానే మాట్లాడారు.. మాట్లాడాలి కూడా.
అదేంటీ, సినిమాని డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయడం తప్ప వేరే గతిలేనప్పుడు, ఆ ఓటీటీకి వ్యతిరేకంగా మాట్లాడటమేంటి.? అనే కదా మీ డౌట్.! కానీ, తప్పదు. ఎందుకంటే, ఇప్పుడు తప్పు చేస్తున్నామని ఇప్పుకోవాలి.. తప్పని పరిస్థితుల్లో చేస్తున్నామని చెప్పాలి. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయబోమనీ చెప్పాలి.
Also Read: Beauty Tips: అందంగా.. మీకు మీరే సొంతంగా.!
సినిమాకి కరోనా పాండమిక్ కారణంగా వచ్చిన కష్టానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ‘టక్ జగదీష్’ సినిమా విషయానికొస్తే, ఈ సినిమాలో నాని (Natural Star Nani) సరసన రీతూ వర్మ (Ritu Varma) హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 10న ‘టక్ జగదీష్’ ఓటీటీ ద్వారా మనింట్లోకే వచ్చేయనుంది.
ఇప్పటికైతే ఇలా.. మరి, నాని తదుపరి సినిమా ‘శ్యామ్ సింఘారాయ్’ పరిస్థితేంటి.? అప్పటికి అన్నీ సద్దుమణిగేసి, థియేటర్లకు ప్రేక్షకులు నిర్భయంగా వెళ్ళేలా పరిస్థితులు మారి.. సినిమా పరిశ్రమకు ఈ ఓటీటీ ఒత్తిళ్ళు వుండకూడదనే ఆశిద్దాం.