Navel Belly Button Piercing.. ముక్కు పుడక గురించి తెలుసుగానీ, ఈ బొడ్డు పుడక ఏంటి.? దీన్న నేవల్ బెల్లీ బటన్ పియర్సింగ్ అని అంటుంటారు.!
అసలేంటీ బొడ్డు పుడక.! ఎలా చేస్తారు.? ముక్కు పుడక అంటే, జస్ట్ అలా ఓ చిన్న సూది లాంటి దాంతో గుచ్చేస్తారు.. జస్ట్ ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది గాయం.!
అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకీ చెవులు కుట్టిస్తుంటారు.! చాలామందికి తెలిసిన విషయమే ఇది. నిజానికి, ఇది కూడా పెద్దగా కష్టమైన పనేమీ కాదు.!
Navel Belly Button Piercing.. బొడ్డు పుడక.. ఇది కాస్త ప్రత్యేకం.!
ముక్కుకి పుడక తగిలించినట్లు.. చెవులకు పోగులు తగిలించినట్లు.. బొడ్డుకి కూడా ఓ ‘పుడక’ తగిలిస్తారు.. అదే బొడ్డు పుడక.!
బొడ్డు పుడక.. నావల్ బెల్లీ బటన్ పియర్సింగ్.. పేరేదైతేనేం.. గ్లామర్ ప్రపంచంలో ఇది కూడా ఓ ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారమైపోయింది.
పలువురు హీరోయిన్లు బొడ్డు పుడకలతో తెరపై దర్శనమిస్తుంటారు. నిజానికి, ఇది కొంత బాధతో కూడిన ప్రక్రియ. కష్టమైన ప్రక్రియ కూడా.!
కుట్టేయడం తేలికేగానీ..
నిజమే.. బొడ్డు పుడకని కుట్టేయడం తేలికే. జస్ట్ గుచ్చేస్తే సరిపోతుంది. కానీ, తగ్గడానికే సమయం పడుతుందట. ఆరు నెలల సమయం వరకు పట్టొచ్చునట.
అంతే కాదు, ఒక్కోసారి పూర్తిగా తగ్గడానికి రెండేళ్ళ సమయం కూడా పడుతుంది. ప్రైవేట్ పార్ట్‌గానే బొడ్డుని అభివర్ణించాల్సి వస్తుంది.
Also Read: సిగ్గొదిలేశారు.! ‘సీఎంవో’లో మహిళా జర్నలిస్టుల కొట్లాట.!
ఇన్ఫెక్షన్ ఈ బొడ్డు పుడక విషయంలో ప్రధానంగా బాధపెడుతుంటుంది. ఒక్కోసారి ప్రమాదకర పరిస్థితులకూ దారి తీస్తుందిట. కానీ, నానాటికీ బొడ్డు పుడక పట్ల ఆకర్షితులవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
బొడ్డు పై భాగంలో.. చర్మానికి ఈ బొడ్డు పుడకని (Belly Button) తగిలిస్తుంటారు. అన్నట్టు, కను రెప్పలపైనా, పెదాలకీ.. చివరికి నాలుకకీ.. ఈ తరహా పుడకలు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.!
మార్కెట్‌లోకి ఏ కొత్త ఫ్యాషన్ వచ్చినా.. దాన్ని ఈ తరం అమ్మాయిలు వెంటనే ఫాలో అయిపోతున్నారు. ఈ బొడ్డు పుడకల విషయంలోనూ అదే జరుగుతోందిట.!
లాభసాటి వ్యాపారం కావడంతో.. విచ్చలవిడిగా ఈ బొడ్డుపుడకలు (Belly Button Piercing) కుట్టేవాళ్ళ సంఖ్యా పెరిగిపోతోంది.
అదే సమయంలో ఈ బొడ్డు పుడకల వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతుండడం దురదృష్టకరం.