Nayanthara Godfather.. సినిమా అంటే సమిష్టి కృషి.! నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లు.. ఇలా అందరూ కలిసి పని చేస్తేనే సినిమా.
నిర్మాత జస్ట్ డబ్బులు ఖర్చు పెడితే సరిపోదు. దర్శకుడు సినిమా తీసేసి చేతులు దులుపుకుంటే కుదరదు. నటీనటులు నటించేసి వెళ్ళిపోయామంటే ఎలా.?
అందరూ కలిసి సినిమా పూర్తి చేసి, దాన్ని ప్రమోట్ చేసుకోవాలి కూడా.! అప్పుడు, సినిమా జనంలోకి బాగా వెళ్ళగలుగుతుంది.
సినిమాలో కంటెంట్ వుంటే హిట్టవుతుంది.. లేదంటే ఫ్లాప్ అవుతుంది.. అది వేరే సంగతి.
Nayanthara.. నయనతారతో వచ్చిన పెద్ద సమస్య అదే..
లేడీ సూపర్ స్టార్ (Lady Super Star Nayanthara) ఆమె.! ఒకప్పుడు సినిమాల ప్రమోషన్లకు బాగానే వచ్చేది. ఏమయ్యిందోగానీ, గత కొంతకాలంగా సినిమా ప్రమోషన్ల గురించి అస్సలు ఆలోచించట్లేదు.
‘నా వల్ల కాదు సినిమాల్ని ప్రమోట్ చేయడం. సినిమాలో నేను నటించాలా.? వద్దా.? అన్నది మీ ఇష్టం..’ అనేస్తుంటుంది నయనతార.

సరే, ప్రమోషన్లకు రాకపోయినా ఫర్వాలేదు.. అంటూ దర్శక నిర్మాతలు ఆమెతో సినిమాలు చేస్తున్నారు. కానీ, ప్రమోషన్ కూడా తన బాధ్యత అని నయనతార గుర్తెరగకపోతే ఎలా.?
ఔను, ఆమె టైమ్ బావుంది..
మామూలుగా ఇలాంటి యాటిట్యూడ్ వుంటే అంతే సంగతులు.! కానీ, నయనతార లక్కు బావుంది. అందుకే, ఆమె సినిమాలు హిట్టయినా, ఫ్లాపయినా, ప్రమోషన్లకు ఆమె రాకపోయినా.. క్రేజ్ మాత్రం ఆమెకు తగ్గట్లేదు.
‘గాడ్ ఫాదర్’ (Godfather Chiranjeevi) సినిమాకి సైతం నయనతార నుంచి ఎలాంటి ప్రమోషన్స్ లేవు. అంతకు ముందు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకీ ఇదే పరిస్థితి.
Also Read: సమంతకి మళ్ళీ ఏమైంది.? ఎందుకింత ఆందోళన.?
నయనతార తప్ప, ఇంకెవరూ అలాంటి పాత్రలకు సరిపోరా.? నయనతార వల్ల ఆయా సినిమాలకు అదనంగా ఒరిగేదేంటి.? అన్న చర్చ సహజంగానే తెరపైకొస్తుంటుంది.
నిజమేనేమో, నయనతార స్థాయి ‘స్టార్ ఎట్రాక్షన్’ ఇంకెవరూ లేరనే అనుకోవాలేమో.! అక్టోబర్ 5న ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదల కానుండగా, నయనతార లేకుండానే ఈ సినిమా ప్రమోషన్లు జరుగుతున్నాయ్.
సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న బాలీవుడ్ సల్మాన్ ఖాన్ మాత్రం, సినిమాని ఏదో ఒక రూపంలో ప్రమోట్ చేస్తూనే వున్నాడు. సల్మాన్ ఖాన్ చెయ్యగా లేనిది, నయనతార ఎందుకు ప్రమోషన్స్ చేయడంలేదట.?