Nayanthara Lady Super Star.. ఎలాగైతేనేం, లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్ళి పీటలెక్కేసింది.!
ఇదేం ప్రస్తావన.? అంటే, పెళ్ళి కోసం నయనతార చాలా పెద్ద యజ్ఞమే చేయాల్సి వచ్చింది. అదో సుదీర్ఘమైన కథ మరి. అందులో బోల్డన్ని మలుపులు కూడా వున్నాయ్.
‘గజిని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది నయనతార. సూర్య హీరోగా నటించిన తమిళ సినిమా అది. తెలుగులోనూ సంచలన విజయాన్ని అందుకుంది.
తెలుగులో ‘లక్ష్మీ’, ‘బాస్’ తదితర సినిమాలతో, నయనతార బోల్డంతమంది అభిమానుల్ని సంపాదించుకుంది.
అప్పట్లో నయనతార స్టైలింగ్‌కి మహిళా అభిమానులు, అందునా అమ్మాయిలు ఫిదా అయిపోయారు తెలుగునాట. చెప్పుకుంటూ పోతే, ఇదో పెద్ద కథ మళ్ళీ.!
తెలుగులో నయనతార ప్రస్థానమిదీ.!
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా టాలీవుడ్ అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేసింది. ప్రభాస్‌తోనూ నయనతార ‘యోగి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అనూహ్యంగా పెరిగిన స్టార్‌డమ్ ఓ వైపు, అంతలోనే ఎఫైర్లు ఇంకో వైపు.. వెరసి, నయనతార కెరీర్‌లో ఎత్తుపల్లాలూ చాలానే వున్నాయ్.

శింబుతో ప్రేమాయణం ఆమె జీవితంలో అతి పెద్ద మచ్చ.. అంటారు కొందరు. అందుక్కారణం, శింబు – నయనతార ప్రైవేట్ మూమెంట్స్ తాలూకు ఫొటోలు లీక్ అవడమే. ఆ తర్వాత శింబుకి నయనతార దూరమయ్యింది.
ప్రభుదేవా – నయనతార మధ్య ఎఫైర్ ఇంకో ప్రసహనం. ప్రభుదేవా సతీమణి అయితే, మీడియా ముందుకొచ్చి నయనతారను నానా రకాలుగా తిట్టింది.
ఆ తర్వాత ఏమయ్యిందోగానీ, నయనతారకు ప్రభుదేవా దూరమయ్యాడు.
Nayanthara Lady Super Star.. ప్రేమకు అప్పట్లో గుడ్ బై చెప్పిందిగానీ.!
ఇక, తన జీవితంలో ప్రేమకు మళ్ళీ చోటు ఇవ్వబోనంటూ ప్రకటించేసిన నయనతార, అనూహ్యంగా మళ్ళీ ప్రేమలో పడింది.. అదీ విఘ్నేష్ శివన్‌తో.
సుదీర్ఘ కాలం విఘ్నేష్ శివన్‌తో సహజీవనం చేశాక, తాజాగా ఈ ఇద్దరూ పెళ్ళిపీటలెక్కారు. సో, ఇక్కడితో కథ సుఖాంతం అయ్యిందని అనుకోవాలేమో.!
తర్వాతేంటి.? ఇంకేముంటుంది, వైవాహిక జీవితం.. పిల్లలు.. అదంతా మళ్ళీ కొత్త కథ. కానీ, నయనతార ఇంకా లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్‌ని కొనసాగించుకోవాలనుకుంటోంది. సినిమాల్లో తగ్గేదే లేదంటోంది.
Also Read: అనసూయ ఆన్‌లైన్ ‘ఆట’: ఆడండి, నాశనమైపోండి.!
‘పెళ్ళయ్యాక కొత్తగా వచ్చే మార్పులేమీ వుండకపోవచ్చు..’ అంటూ పెళ్ళికి కొద్ది రోజుల ముందు నయనతార వ్యాఖ్యానించడమే అందుకు నిదర్శనం.
అబ్బే, నయనతార ఇకపై సినిమాల్లో నటించబోదు.. అంటూ ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది.
ఇంతకీ ఏది నిజం.? ప్రస్తుతానికైతే నయనతార చేతిలో పలు సినిమాలున్నాయ్.. తెలుగు, తమిళ సినిమాలే కాదు, హిందీలోనూ సినిమాలు చేస్తోంది నయనతార.