Niharika Konidela Mega Producer.. నిహారిక కొణిదెల.. మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్‌గా వెలుగు వెలగాలనుకుంది. కానీ, కుదరలేదు. నిర్మాతగా రూటు మార్చింది.
ఆల్రెడీ నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ఓ సూపర్ హిట్టు నిహారిక ఖాతాలో వేసేసుకుంది.
రీసెంట్‌గా ఈ సినిమాకి ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది నిహారిక. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Niharika Konidela Mega Producer.. నిర్మాతగా నిహారిక.. కొత్త కొత్తగా..!
కొత్త కుర్రాళ్లను కంటెంట్ వున్న చిన్న సినిమాలనూ తన నిర్మాణంలో ఎంకరేజ్ చేస్తున్న నిహారిక ఈ సారి కొత్త జోనర్‌తో రాబోతోంది.
‘రాకాస’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో రూపొందినట్లు లేటెస్ట్‌గా రిలీజ్ అయిన టీజర్‌ని బట్టి అర్ధమవుతోంది.
అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో కొన్ని సూపర్ నేచురల్ పవర్స్.. అమెరికా నుంచి వచ్చి, అనుకోకుండా అందులో ఇరుక్కున్న‘వీరు’ అనే కుర్రాడు ఆ సిట్యువేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు.? అనే కాన్సెప్ట్‌లో హిలేరియస్ అలాగే కొన్ని హారర్ మూమెంట్స్‌తో టీజర్ కట్ చేశారు.
టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. వీరు పాత్రలో సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. నయన్ సారిక ఫీమేల్ లీడ్ పోషిస్తుండగా, మానస శర్మ అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాతో డెబ్యూ చేస్తోంది.
మెగా నిర్మాతలు..
ఇదిలా వుంటే, ఈ ఏడాది సంక్రాంతికి మెగా కాంపౌండ్ నుంచే అక్క సుస్మిత నిర్మాతగా బంపర్ హిట్ కొట్టేసింది ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ సినిమాతో.
‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాతో ఆల్రెడీ ఓ హిట్టు కొట్టి నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్న నిహారికకు.. ఈ సినిమాతో హిట్టు దక్కితే.. నో డౌట్.! నెక్స్‌ట్ స్టార్ ప్రొడ్యూసర్ల లిస్టులో చేరిపోవడం ఖాయం.
చూడాలి మరి, అక్క సుస్మితతో మాంచి బోణీ కొట్టిన ఈ ఏడాది నిహారికకు కూడా మెగా బంపర్ హిట్ అందిస్తుందేమో.!
