Niharika NM Mithramandali.. ఎవరీ నిహారిక.? ఏమా కథ.! ఆల్రెడీ గతంలో చెప్పేసుకున్నాం. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. అప్పట్లో ఇంటర్వ్యూలు చేసేది.
ఇప్పుడామె, నటిగా తెలుగు తెరపై మెరవబోతోంది. తెరంగేట్రం చేస్తున్న తెలుగు సినిమా పేరేమో ‘మిత్రమండలి’.
ప్రియదర్శి సహా ఓ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్.. ఆపై, నిహారిక.. అందరూ కలిసి ఆమెని లవ్ చేయడం.. ఆ తర్వాత ఏదో తతంగం నడుస్తుంది.
Niharika NM Mithramandali.. ట్రైలర్.. ప్చ్, అస్సలు బాలేదాయె.!
‘మిత్రమండలి’ ట్రైలర్ వచ్చింది. అంతా రొద. వెన్నెల కిషోర్, సత్య తదితరులు నవ్వులు పూయించేందుకు ప్రయత్నించారు.
కామెడీ, కనాకష్టంగా ట్రైలర్లో కనిపించిందంటే, ఇక థియేటర్లో నవ్వుకోవడానికి ఏముంటుంది.? పూర్తిగా చేతులెత్తేసినట్లున్నారు కమెడియన్లంతా.
ట్రైలర్ తర్వాత అంతటా వినిపించిన మాట ఇదే. కానీ, నిహారిక మీద బోల్డంత నమ్మకంతో ఈ సినిమా చేశామని దర్శక నిర్మాతలు అంటున్నారు.
నిహారిక.. అల్లు అరవింద్..
నిహారికని, ఫేక్ హ్యాండిల్ ద్వారా ఫాలో అవుతూ వచ్చారట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
దాన్ని, తాజాగా నిర్మాత బన్నీ వాసు కూడా కన్ఫామ్ చేశారు. నిహారిక ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ అనీ, అల్లు అరవింద్ మనసు ఇరవై ఆరేళ్ళనీ బన్నీ వాసు సెలవిచ్చారు.

ఏమో, నిహారికలో అంత ఏం నచ్చేసిందో అల్లు అరవింద్‌కి.. అదో మాయ.! వాస్తవానికి, నిహారిక సింగిల్ ఎక్స్ప్రెషన్ క్యాండిడేట్.. అన్న విమర్శలున్నాయి.
ట్రైలర్లో కొన్ని సీన్స్‌లో నిహారిక ఎక్స్‌ప్రెషన్స్‌కి మతిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంత, అయోమయంతో కూడిన హావభావాలు ప్రదర్శించింది నిహారిక.
Also Read: మళ్ళీ అదే ప్రశ్న.! అనుష్క శెట్టికి మళ్ళీ ఏమయ్యింది.?
అయినాసరే, నిహారిక మీదనే ‘మిత్రమండలి’ భారమంతా.! దీన్నే భావదారిద్ర్యం.. అనొచ్చా.?
అన్నట్టు నిహారిక నటించిన ‘పెరుసు’ అనే అడల్ట్ కామెడీ.. అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అందులో కూడా అంతే, సింగిల్ ఎక్స్ప్రెషన్తో కానిచ్చేసింది నిహారిక.
