Nikesha Patel సోషల్ మీడియాని ఫుల్లుగా వాడేసుకోవాలనుకుంది, వాడేసింది కూడా. రెచ్చిపోయి మరీ సోషల్ మీడియాలో ఎడా పెడా పోస్టులు పెట్టేసింది. అయినా, ఆశించిన మేర ఫాలోవర్స్ పెరగలేదు. మధ్యలో వివాదాస్పద వ్యాఖ్యలూ చేసి వార్తల్లోకెక్కింది. సోసల్ మీడియాలో పాపులారిటీ కోసం ఏం చేయాలో అన్నీ చేసినా.. పాపం పాప ఫెయిలయ్యింది.!
పరిచయం అక్కర్లేదు ఆమె గురించి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కొమరం పులి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటిష్ మూలాలూన్న బ్యూటీ నికీషా పటేల్ గురించే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది. తొలి తెలుగు సినిమా ఫ్లాప్ అవడంతో, స్టార్ హీరోయిన్ అవుదామనుకున్న ఆమె ఆశలు అడియాసలయ్యాయి.
Nikesha Patel సోషల్ మీడియాపై అబాండాలా.?
కొన్ని తమిళ సినిమాలతో కొంత హంగామా చేయాలనుకున్నా, అక్కడా చతికిలపడ్డ నికీషా పటేల్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా విషపూరితం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేనా, సినిమా ఇండస్ట్రీ మీద కూడా అవే వ్యాఖ్యల్ని చేసేసింది నికీషా పటేల్.

సినిమా రంగం అన్నాక సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి సర్వసాధారణం. టాలెంట్ వున్నా ఒక్కోసారి అవకాశాలు దొరకవు. టాలెంట్ లేకపోయినా స్టార్‌డమ్ వచ్చేస్తుంటుంది. లక్కు కలిసొస్తే ఒకలా, కలిసిరాకపోతే ఇంకోలా.!
వాళ్ళకోసమే అవన్నీ చేసిందట..
సోషల్ మీడియాలో అభిమానుల కోరిక మేరకు బికినీ పోజులతో పోస్టులు పెట్టాననీ, అందుకోసం తానెంత కష్టపడినా తనకు తగిన గుర్తింపు రాలేదనీ, పైగా విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొన్నాననీ నికీషా పటేల్ వాపోయింది. ఇదెక్కడి వింత వాదన.?
Also Read: స్పెషల్ ఐటమ్: సమంత టాపు.. అప్సర తోపు.!
ప్రస్తుతానికైతే బ్రిటన్ వెళ్ళిపోయి, అక్కడే ఇతరత్రా ప్రయత్నాల్లో బిజీ అయిపోయింది నికీషా. మళ్ళీ ఇండియన్ సినిమా వైపు వచ్చేదెప్పుడు.? అంటే, ‘నాకేం తెలుసు.?’ అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది నికీషా పటేల్ (Nikesha Patel) .