Nikhil Siddartha Anupama Parameswaran.. సినిమా విడుదలకు ముందు, కెలుక్కోవడం అవసరమా.? ‘కార్తికేయ-2’ సినిమా అనేక బాలారిష్టాల్ని ఎదుర్కొని, ఎలాగైతేనేం విడుదలకు సిద్ధమయ్యింది.
సినిమా ప్రమోషన్లలో హీరో నిఖిల్ సిద్దార్ధ చాలా బిజీగా వున్నాడు. తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో నిఖిల్ ఎప్పుడూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంటాడు.
ఆయా నగరాల్లో బంగారు విగ్రహాలంటూ.. కొత్తగా ప్రయత్నం చేసింది ఈసారి ‘కార్తికేయ-2’ (Kartikeya 2) టీమ్. సినిమాకి మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది.!
Nikhil Siddartha Anupama Parameswaran.. ఎందుకు కెలుక్కున్నావ్ నిఖిల్.?
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), ఈ సినిమా ప్రమోషన్లలో కనిపించడంలేదు. ఈ విషయమై నిఖిల్ సిద్దార్ధ (Nikhil Siddartha) ఒకింత తొందరపాటుతనం ప్రదర్శించాడు.

‘సినిమా షూటింగ్ అంటే చాలా ఉత్సాహం చూపిస్తుంటుంది. అదే, సినిమా ప్రమోషన్ అంటే మాత్రం అస్సలు స్పందించదు..’ అంటూ అనుపమ మీద ఆరోపణలు చేశాడు నిఖిల్.
ఇంతకన్నా నోటి దురద ఇంకేముంటుంది.? అనుపమ చాలా ప్రొఫెషనల్ అన్నాడు.. షూటింగ్ సమయంలో చాలా యాక్టివ్‌గా వుంటుందని కూడా చెప్పాడు. మరెందుకిలా నిఖిల్ అనుపమ మీద అబాండాలు మోపినట్టు.?
కౌంటర్ ఎటాక్ చేసిన అనుపమ..
ప్రస్తుతం తాను రెండు సినిమాల షూటింగుల్లో పగలు, రాత్రి బిజీగా వున్నానంటూ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) వివరణ ఇచ్చింది.
అంతే కాదు, ‘కార్తికేయ – 2’ (Kartikeya 2 Movie) సినిమా విడుదల విషయమై కొంత గందరగోళం చోటు చేసుకుందనీ, రిలీజ్ డేట్ మారడంతో, తన కమిట్మెంట్స్ నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరలేదని కూడా పేర్కొంది అనుపమ.
Also Read: రణ్‌వీర్ వర్సెస్ షెర్లీన్.! ‘విప్పు’డు.. వివాదం రాజేసుడు.!
నిజమే మరి.. ఆయా సినిమాల షూటింగుల్లో అనుపమ బిజీగా వున్నప్పుడు, ‘కార్తికేయ-2’ (Karthikeya 2 Movie) ప్రమోషన్లకు రాలేకపోతే, అనుపమని ఎలా తప్పు పట్టగలం.?
పైగా, అనుపమ (Anupama Parameswaran) తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అనవసరంగా కెలుక్కున్నాడు కదూ నిఖిల్ సిద్దార్ధ.!