Nikhil Siddhartha Swayambhu AI.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ ‘స్వయంభు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా రిలీజ్‌కి సన్నద్ధం చేస్తున్నారు ‘స్వయంభు’ సినిమాని. ఇటీవలే టీజర్ విడుదల చేశారు. దాంతోపాటే, కాంట్రవర్సీ కూడా షురూ అయ్యింది.
‘మా సినిమా ఏఐ కాదు.. ఇంతకు ముందు విడుదలైనట్లుగా కాదు..’ అంటూ నిఖిల్ వేసిన ట్వీట్, వివాదానికి కారణమయ్యింది. ఇంతకీ, నిఖిల్ సిద్దార్ధ ఎందుకు కెలుక్కున్నట్లు.?
అసలంటూ ఎవర్ని నిఖిల్ సిద్దార్ధ టార్గెట్ చేసుకున్నాడు.? ఎందుకీ వివాదం.? అంటూ పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది.
Nikhil Siddhartha Swayambhu AI.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడితే నేరమా.?
ఈ మధ్య వచ్చే సినిమాల్లో కొంతమేర ఏఐ సాంకేతికతను వాడుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఓ అద్భుతం. దాన్ని ఉపయోగించుకుని, కొన్ని పాత్రల్ని క్రియేట్ చేస్తున్నారు.
పూర్తిగా ఏఐ సాంకేతికత వినియోగించి సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందుతున్న రోజులివి. ఈ సాంకేతికని సినిమాల్లో వినియోగించుకుంటే తప్పేముంది.?
నిజానికి, తప్పేమీ లేదు. కాకపోతే, ఒరిజినాలిటీ మిస్ అవుతోందన్న వాదనలున్నాయి. సినిమా వర్కవుట్ అయితే ఏఐ అద్భుతం.. లేదంటే, ఏఐ అనేది దండగ వ్యవహారం.. ఇలా మారింది పరిస్థితి.
Also Read: ప్రేమికుల రోజు.. అంటే, ఆల్ ఫూల్స్ డే.!
తన సినిమా గురించే నిఖిల్ ప్రస్తావించాడు.. ముందు రిలీజ్ చేసిన ప్రోమోలో కొంత క్వాలిటీ ఇష్ట్యూ వుంది.. ఆ సమస్యని అధిగమించి, ఇంకో ప్రోమో విడుదల చేశారు.. అని కొందరంటున్నారు.
కానీ, ‘స్వయంభు’ సినిమాకి బోల్డంత డ్యామేజ్ జరిగిపోయింది నిఖిల్ ట్వీటుతో. టీజర్ రిలీజ్ చేసే క్రమంలో చేసిన పబ్లిసిటీ స్టంట్ బెడిసికొట్టిన సంగతి తెలిసిందే.
ఈ మధ్య ఏదన్నా వివాదాన్ని స్వయంగా క్రియేట్ చేసుకుంటే, ఆయా సినిమాలు దారుణంగా దెబ్బ తింటున్నాయి. ఆడియన్స్, ఆ సినిమాల్ని లైట్ తీసుకుంటున్నారు.
వివాదం ముదిరి పాకాన పడిన దరిమిలా, నిఖిల్ సిద్దార్ధ ‘ఏఐ’ ట్వీటు విషయమై ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిది.! లేదూ, వివాదంతో పబ్లిసిటీ వచ్చిందని మురిసిపోతే.. అంతే సంగతులు.!
