Nikkar Minister Liquor MLA.. రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి, ప్రతిసారీ కొత్త లోతుల్ని వెతుక్కుంటున్నారు రాజకీయ నాయకులు.!
తమ అధినేతల మెప్పు కోసం, సోషల్ మీడియా హ్యాండిళ్ళ ద్వారా రాజకీయ పార్టీలు దిగజారుతున్న వైనం, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వుంటోంది.
ఆ పార్టీ, ఈ పార్టీ.. అన్న తేడాల్లేవు. ప్రధాన పార్టీలన్నిటిదీ ఇదే బాపతు.! రాజకీయమంటే ప్రజా సేవ అనీ.. ప్రశ్నించడానికి, సద్విమర్శ సరిపోతుందనేది పాత మాట.
ఇప్పుడెంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే, అంత గొప్పగా రాజకీయ విమర్శ చేసినట్లు అర్థం చేసుకోవాలేమో.! అలా తయారయ్యింది పరిస్థితి.
Nikkar Minister Liquor MLA.. నిక్కర్ మంత్రి ఎక్కడ.?
మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ‘నిక్కర్ మంత్రి ఎక్కడా.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించేసింది.
కౌంటర్ ఎటాక్, అటు వైపునుంచి ఎంత తీవ్రంగా వస్తుందో వైసీపీ అధినాయకత్వానికి తెలియదా.? ఒకవేళ, అదే స్థాయిలో బూతులతో గనుక, టీడీపీ కౌంటర్ ఎటాక్ ఇచ్చి వుంటేనో.?
అయితే, ఇక్కడ టీడీపీ ఒకింత బాధ్యతగానే రాజకీయ విమర్శ చేసింది. ‘లిక్కర్ ఎమ్మెల్యే గుండెల్లో’ అని సమాధానమిచ్చింది టీడీపీ.
Also Read: నేరాలకు పాల్పడితే.! దేశం వెలుపల వున్నా తప్పించుకోలేరు.!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘లిక్కర్ ఎమ్మెల్యే’ అని పేర్కొంది టీడీపీ. ‘కావాలంటే, కర్నాటకకి ఫోన్ చేసి కనుక్కో’ అని కూడా ఓ లైన్ యాడ్ చేసింది తెలుగు దేశం పార్టీ.
ఒకవేళ ‘నిక్కర్’ కంటే, దిగజారి.. వైఎస్ జగన్ మీద, టీడీపీ గనుక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వుంటేనో.? ఆ మాత్రం సోయ లేకుండా వైసీపీ, ‘నిక్కర్’ ట్వీట్ ఎలా వేయగలిగిందో ఏమో.!
అయినా, రాజకీయాల్ని బూతుమయం చేసేశాక.. ‘నిక్కర్ మంత్రి’ ఏంటీ, ‘లిక్కర్ ఎమ్మెల్యే’ ఏంటి.?
