Nithin Robinhood Fun.. హీరో నితిన్ తన కొత్త సినిమా ‘రాబిన్ హుడ్’ ప్రమోషన్లతో బిజీగా వున్నాడు. సినిమా అన్నాక ప్రమోషనల్ ఈవెంట్స్ తప్పనిసరి.
ప్రమోషనల్ ఈవెంట్లలో ఈ మధ్య సినీ జనాల అతి వాగుడు హద్దులు దాటుతోందనే కంప్లయింట్ తరచూ వింటున్నాం. అదో టైపు పబ్లిసిటీ స్టంట్.. అని కొందరు భావిస్తున్నమాట కూడా వాస్తవం.
అయితే, తాజాగా నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో చేసిన ‘కామించుకోవడం’ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయ్.. వివాదాస్పదమవుతున్నాయ్ కూడా.!
Nithin Robinhood Fun,, అసలు కామించుకోవడమంటే ఏంటి.?
సినిమాని ముందే చూసుకుంటారు సినీ జనాలు.. అదీ సినిమా రిలీజ్‌కి ముందు. చిన్నా చితకా కరెక్షన్స్‌కి ఛాన్స్ ఏమైనా వుంటే చేసుకోవాలి కదా మరి.!
అలాగే, ‘రాబిన్ హుడ్’ టీమ్ కూడా, సినిమాని ముందే చూసుకుంది. చూసుకుని, చాలా హ్యాపీ ఫీలయ్యింది. ఈ క్రమంలో దర్శకుడ్ని వాటేసుకున్నాడట నితిన్.
‘సినిమాని చూసుకున్నాం.. చాలా బాగా వచ్చింది. దర్శకుడు, నేనూ ప్రేమించుకున్నాం.. కౌగలించుకున్నాం కూడా..’ అని నితిన్ చెప్పడంతో, ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు.
ఇంకో అడుగు ముందుకేసి, ‘కామించుకున్నాం.. అక్కడితో ఆగాం..’ అని నితిన్ సెలవిచ్చేసరికి, అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది.
ఫన్ టోన్‌లోనే నితిన్ ఇదంతా చెప్పినాగానీ, నెటిజన్లకు వేరే టైపులో అర్థమయ్యింది.. ఈ ‘కామించుకునే పైత్యం’.! మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే సమస్యే ఇది.
నితిన్ ఏమీ కొత్త హీరో కాదు.! చాలాకాలంగా సినిమాల్లో వున్నాడు. సో, కొంచెం బాధ్యతగా వేదికలపై మాట్లాడితే బెటర్.. అన్నది చాలామంది అభిప్రాయం.
లైట్ తీస్కో బాసూ.. ఇది జస్ట్ ఫన్.. అని అంటారా.? నడుస్తున్నది సోషల్ మీడియా కాలం.! ట్రోలింగ్ ఎలా జరుగుతోందో చూస్తున్నాం కదా.! సినిమాపై నెగెటివిటీకి ఇదే కారణమైతేనో.?