Nora Fatehi Telugu Songs.. వైజాగ్ సన్నీలియోన్.. నెమలి.. ఇలా చాలా పేర్లున్నాయ్ ఆమెకి. ఇవన్నీ తెలుగు సినిమాల్లోని పేర్లు మాత్రమే. బాలీవుడ్‌లో అయితే, లెక్కలేనన్ని.
నిజానికి ఈ బ్యూటీ విదేశీ పోరీ. బాలీవుడ్‌లో సెటిలైపోయింది. నోరా ఫతేహీ.. పరిచయం అక్కర్లేని పేరిది.
తెలుగు ప్రేక్షకులకి నోరా ఫతేహీ అనగానే, ‘నెమలి’ గుర్తుకొస్తుంది.. ‘వైజాగ్ సన్నీలియోన్’ కూడా గుర్తుకొస్తుంది.
నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఊపిరి’ సినిమాలో.. ‘నెమలి’ పేరుతో స్పెషల్ సాంగ్ చేసినా, యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా నటించిన ‘టెంపర్’ సినిమాలో వైజాగ్ సన్నీలియోన్‌గా చిందులేసినా.. నోరా ఫతేహీ రూటే సెపరేటు.
పేరేదైతేనేం.. పాప మాత్రం వయ్యారాల గని.!
అంతేనా, ‘మనోహరీ’.. అంటూ, ‘బాహుబలి’ సినిమాలోనూ నోరా ఫతేహీ అదరగొట్టేసింది. దేనికదే చాలా చాలా ప్రత్యేకం అన్నట్టుగా వుంటాయ్ ఆయా స్పెషల్ సాంగ్స్.
ఏమో, కేవలం నోరా ఫతేహీ కోసమే ప్రత్యేకంగా ఆ పాటలలా డిజైన్ చేయబడ్డాయేమో.! ఏ పాటకి డాన్స్ చేసినా, 100 శాతం కాదు, అంతకు మించి ఎపర్ట్స్ పెట్టడమే తన సక్సెస్ సీక్రెట్ అంటోంది ఈ బ్యూటీ.

తనది కాని ప్రాంతంలో.. తనకు ఆత్మీయుల్ని సంపాదించి పెట్టిన సినిమా తనకు చాలా చాలా ప్రత్యేకమైనదని చెప్పడం నోరా ఫతేహీకే చెల్లింది.
Nora Fatehi Telugu Songs.. డాన్స్.. డాన్స్ డాన్స్.!
నిజమే, ఆమె భారతదేశానికి చెందినది కాదు. కాకపోయినాగానీ, భారతీయ సినిమాపై తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
డాన్స్ అంటే, సినిమా కోసం చేసేది మాత్రమే కాదట. డాన్స్‌ని ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుందట నోరా ఫతేహీ.
తనకంటే చాలా గొప్ప డాన్సర్లు చాలామందే వున్నా, తనను అదృష్టం వహించిందని చెబుతుంటుంది ఈ బ్యూటీ. ఎంత ఎదిగినా ఒదిగి వుండడమే బహుశా నోరా ఫతేహీ సక్సెస్ సీక్రెట్ అయి వుంటుంది.
Also Read: నాన్సెన్స్.! సన్నీలియోన్‌కి అభిమానులేంటి.?
చూస్తున్నారుగా, నెమలి అలియాస్ వైజాగ్ సన్నీలియోన్ అలియాస్.. మనోహరి.. అలియాస్ నోరా ఫతేహీ చిందుల్ని.!