NTR Vs YSR.. స్వర్గీయ నందమూరి తారక రామరావు.. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇద్దరూ తెలుగు ప్రజలకు సుపరిచితులే.!
ఒకరేమో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఇంకొకరేమో కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కారణమైన వ్యక్తి. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా పని చేశారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీయార్ మరణించి చాలాకాలమే అయ్యింది. ఇక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి 13 ఏళ్ళవుతోంది.
NTR Vs YSR వ్యక్తుల మధ్య కాదు, పేర్ల మధ్య గొడవ..
ఇప్పుడీ ఇద్దరి మధ్యా గొడవ జరుగుతోంది. కాదు కాదు, వీరి పేర్ల మధ్య గొడవ జరుగుతోంది. స్వర్గీయ ఎన్టీయార్‌ని ‘జీరో’ అని అభివర్ణిస్తోంది ఓ రాజకీయ పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ‘రౌడీ’ అంటోంది మరో పార్టీ.
‘చచ్చి బతికిపోయారు.. లేదంటే, ఇప్పుడు వీళ్ళ గొడవల కారణంగా ఉరేసుకుని చచ్చిపోవాల్సి వచ్చేది..’ అంటూ అటు ఎన్టీయార్‌ని అభిమానించేవాళ్ళూ, వైఎస్సార్‌ని అభిమానించేవాల్ళూ అభిప్రాయపడుతున్నారు.
పేరులో ఏముంది.? ఔను, పేరులో ఏముంటుంది.? మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్.. ఝాన్సీ లక్ష్మీబాయి.. వీళ్ళెవరూ పేరు కోసం తపించలేదే.!
సిగ్గు లేని రాజకీయం..
అసలంటూ పేరు కోసం తపించేవాడు నాయకుడే కాదు. మంది సొమ్ముతో సొంత పబ్లిసిటీ చేసుకోవడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది.
లేకపోతే, ఆయా సంక్షేమ పథకాలకు తమ పేర్లు కావొచ్చు, తమవారి పేర్లు కావొచ్చు ఎలా ఎవరైనా పెట్టగలుగుతారు.? సిగ్గుండాలి కదా.. అది తమ సొమ్ముతో చేస్తున్న ఘనకార్యం కాదనే తెలివి వుండాలి కదా.? అన్నది జనం మాట.. ప్రజాస్వామ్యవాదుల ఆవేదన.
Also Read: ‘గాడ్ ఫాదర్’ చిరంజీవిని వెంటాడుతున్న రాజకీయం.!
మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా ఎన్టీయార్‌ని వైసీపీ జీరో చేసేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ‘రౌడీ’గా చూపేందుకు ప్రయత్నిస్తోంది.
పేర్లు పెడుతున్నారు.. పరువు తీస్తున్నారని ఊరకనే అనలేదు. ఎన్టీయార్ ఆత్మ అయినా, వైఎస్సార్ ఆత్మ అయినా.. తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతుంటాయ్.. అవిప్పుడు ఘోషిస్తుంటాయ్.!