NTR30 Saif Ali Khan.. తెలుగు సినిమా, తమిళ సినిమా.. బాలీవుడ్ సినిమా.. ఇవన్నీ ఒకప్పుడు.! ఇప్పుడైతే అంతా ఇండియన్ సినిమానే.!
‘ఔను, మేం అన్ని బౌండరీలూ చెరిపేసుకున్నాం..’ అని పలువురు నటీనటులు చెబుతున్న దరిమిలా, మారాల్సింది కొందరు సినీ అభిమానులు మాత్రమే.!
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొత్త సినిమా కోసం బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ చేస్తున్న సినిమా ఇది.
NTR30 Saif Ali Khan.. బాలీవుడ్‌కి వెంకటేష్..
సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్‌కి వస్తే, బాలీవుడ్‌కి విక్టరీ వెంకటేష్ వెళ్ళాడు.! మళ్ళీ ఈ టాలీవుడ్, బాలీవుడ్ ఏంటబ్బా.? అదంతే.!
సల్మాన్ ఖాన్ – పూజా హెగ్దే జంటగా తెరకెక్కిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నట్టు, ఈ సినిమాలో ఓ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కనిపిస్తున్నాడు.
హరి హర వీరమల్లు కోసం బాబీ డియోల్..
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమా కోసం బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ని తీసుకొచ్చారు.
నిజానికి, బాలీవుడ్ – టాలీవుడ్ నటులు కలిసి నటించడం ఇదే కొత్త కాదు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పలు తెలుగు సినిమాల్లో నటించాడు.
అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున పలు బాలీవుడ్ సినిమాల్లో నటించడం తెలిసిన విషయమే కదా.!