Table of Contents
OG Pawan Kalyan Bhaktulu.. సినీ నటుల్ని, ఆరాధ్య దైవాలుగా కొలుస్తుంటారు అభిమానులు.! అందునా, పవన్ కళ్యాణ్ అంటే, ఆయన భక్తుల ‘ఇజం’ వేరే లెవల్ అంతే.!
భారతీయ సినీ పరిశ్రమలోనే కాదు, ప్రపంచ సినీ రంగంలో.. ఏ నటుడికీ లేని విధంగా, ‘పవనిజం’ అంటూ, ఓ ‘ఇజాన్ని’ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్ళ క్రితం ‘క్రియేట్’ చేసుకున్నారు.
‘ఆ స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు’ అంటాడో భక్తుడు.. ఆ భక్తుడు, ఓ సినీ ప్రముఖుడు కావడం గమనార్హం.
OG Pawan Kalyan Bhaktulu.. ఈ భక్తులు వేరే లెవల్..
భక్తులందు, ఓజీ భక్తులు వేరయా.. అని చెప్పుకోవాలేమో. ఔను, దర్శకుడు సుజీత్ అలాగే సంగీత దర్శకుడు తమన్.. ఈ ఇద్దర్నీ ఓజీ పవన్ కళ్యాణ్ భక్తులు.. అని చెప్పుకోవాల్సి వుంటుంది.
‘ఓజీ’ సినిమా కోసం ఇటు దర్శకుడు సుజీత్, అటు సంగీత దర్శకుడు తమన్ పెట్టిన ఎఫర్ట్స్.. అంతా ఇంతా కాదు.! సినిమా అనేది ఈ ఇద్దరికీ ప్యాషన్.
పవన్ కళ్యాణ్ అంటే, తెలుసు కదా.. ఆ పవనిజంలో.. ఈ ఇద్దరూ సమ్‌థింగ్ వెరీ వెరీ స్పెషల్ అంతే.!
ప్రతికూల పరిస్థితుల్లో..
ఓజీ సినిమాకి ఏదీ కలిసిరావడం లేదు.. అనే పరిస్థితుల్లో, అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు సుజీత్, తమన్.
తమన్‌కి తన మ్యూజిక్‌తో మాట్లాడే అవకాశం దక్కింది. సుజీత్ అలా కాదు, చాలా చాలా ఒత్తిడిని అనుభవించాడు, సినిమా కంటెంట్, ఓవర్సీస్‌కి పూర్తిస్థాయిలో వెళ్ళే వరకూ.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ ప్రదర్శించలేకపోవడంతో, సుజీత్ ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నాడో, ఆ వేదికపై అతన్ని చూసినవారెవరికైనా అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ భరోసా..
సినిమా హిట్టయినా, ఫట్టయినా.. పవన్ కళ్యాణ్‌కి ఏమీ ఫరక్ పడదు.! అంతకు మించిన రేంజ్ పవన్ కళ్యాణ్‌ది. కానీ, సుజీత్‌కి అలా కాదు. అందుకే, పవన్ కళ్యాణ్ పూర్తి భరోసా ఇచ్చాడు సుజీత్‌కి.
ఇక, తమన్ అయితే కొణిదెల తమన్ కళ్యాణ్.. అని అభిమానులతో ముద్దుగా పిలిపించుకుంటుంటాడు. ‘ఓజీ’ సినిమాకి తమణ్ ఇచ్చిన మ్యూజిక్.. చాలాకాలం గుర్తుంటుంది.
Also Read: Kaliyugam 2064 Review.. సాగతీత.. సర్వైవల్ థ్రిల్లర్.!
సుజీత్ మేకింగ్ అయితే, నెక్స్‌ట్ లెవల్.. అని చెప్పుకోవచ్చేమో. ‘ఫైర్ స్టార్మ్’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ దగ్గర్నుంచి, ట్రైలర్ వరకు.. భక్తుడిలానే, ప్రతి ఫ్రేమ్‌లో తన దేవుడ్ని చూపించుకున్నాడు.
ఆల్ ది బెస్ట్ టు ఓజీ టీమ్.! ప్రత్యేకించి.. సుజీత్ ఆల్ ది బెస్ట్.!
